పౌరాణిక పాత్రలో మహేశ్ బాబు: కెరీర్‌లో తొలిసారి అలా.. ఆ 15 నిమిషాలు మామూలుగా ఉండదట

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు. బాల నటుడిగానే మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అలా ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతలో వేసుకున్నాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయిపోయాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకు రేంజ్‌ను పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే హిట్లు మీద హిట్లు కొడుతూ హవాను చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్‌లో ఉన్న మహేశ్ బాబు.. సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో పౌరాణిక పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

హ్యాట్రిక్ హిట్లు కొట్టేసిన మహేశ్ బాబు

హ్యాట్రిక్ హిట్లు కొట్టేసిన మహేశ్ బాబు

ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తీసిన 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేసి మార్కెట్‌ను పెంచుకున్నాడు.

సర్కారు వారి పాట అంటోన్న మహేశ్

సర్కారు వారి పాట అంటోన్న మహేశ్

మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదలపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి.

స్టోరీ లైన్ అలా.. హైలైట్ క్యారెక్టర్‌ అని

స్టోరీ లైన్ అలా.. హైలైట్ క్యారెక్టర్‌ అని

'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఇందులో మహేశ్ క్యారెక్టర్ పాత రోజులను గుర్తు చేస్తుందని టాక్.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేశాడు

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేశాడు


'సర్కారు వారి పాట' నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్రను సృష్టించింది.

పౌరాణిక పాత్రను పోషిస్తున్న మహేశ్

పౌరాణిక పాత్రను పోషిస్తున్న మహేశ్


క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు లుక్ ఎలా ఉంటుందో టీజర్‌లోనే చూపించారు. ఇన్ని రోజులూ సందేశాత్మక చిత్రాలతో ఫ్యాన్స్‌కు కావాల్సిన అంశాలను మహేశ్ అందించలేకపోయాడు. అదంతా ఈ చిత్రంతో భర్తీ చేయాలని చూస్తున్నాడు. అందుకే ఈ మూవీలో అతడు ఓ పౌరాణిక గెటప్‌లో కనిపించబోతున్నట్లు తాజాగా న్యూస్ లీక్ అయింది.

Recommended Video

KondaPolam : Panja Vaishnav Tej's Kondapolam Audio Release Event
 ఆ 15 నిమిషాలు హైలైట్‌ ఉంటుంది

ఆ 15 నిమిషాలు హైలైట్‌ ఉంటుంది


'సర్కారు వారి పాట' మూవీలో క్లైమాక్స్ ఎపిసోడ్ సింహాచలం దేవాలయం నేపథ్యంతో సాగుతుందట. అక్కడ జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లో మహేశ్ బాబు వరాహా లక్ష్మీనరసింహా స్వామి గెటప్‌తో కనిపిస్తాడట. ఆ గెటప్ వేసుకునే విలన్‌ను మట్టుబెడతాడని అంటున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలవబోతుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X