మహేష్ - నాగార్జున.. ఏదో జరుగుతోంది.. ఆ సినిమాలో ఫిక్స్ అయినట్లేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా చాలా స్నేహంగా ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ చేసేందుకు ముందుంటాడు. ఇక ఇతర హీరోలు వారి సినిమా ప్రమోషన్ కోసం ఎలాంటి సహాయం అడిగినా కూడా చేస్తుంటాడు. సినిమా టీజర్స్ ట్రైలర్స్ సాంగ్స్ ఇలా ఏవైనా రిలీజ్ చేయమని అంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. ఇక ఏదైనా మంచి సినిమా వచ్చింది అంటే వెంటనే దాన్ని చూసేందుకు కూడా మహేష్ రెడీ అవుతాడు.
ఇక రీసెంట్ గా మహేష్ బాబు నాగార్జున సినిమాకు సంబంధించిన ది ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందని అంటూ అలాగే నాగార్జున గారితో పాటు చిత్ర యూనిట్ అందరికి కూడా మహేష్ తన బెస్ట్ విషెస్ అంధించాడు. ఇక మహేష్ ట్రైలర్ విడుదల చేయగానే నాగార్జున ట్విట్టర్ లోనే మరొక విషయాన్ని ప్రస్తావించాడు.

హే మహేష్ !! 29 ఏళ్ల క్రితం మీ నాన్నగారు సూపర్‌స్టార్ కృష్ణ గారు వారసుడు సినిమా కోసం నాతో కలిసినపుడు చాలా సంతోషించాను. మనం ఆ సర్కిల్‌ను ఎందుకు పూర్తి చేయకూడదు.. అని నాగార్జున కలిసి సినిమా చేద్దామనే ఆలోచనతో అడిగాడు. అందుకు మహేష్ బాబు కూడా చాలా హ్యాపీగా మరో సమాధానం ఇచ్చారు. ఒక సంపూర్ణ ఆనందంగా ఉంటుంది... ఇప్పుడు అది ఎదురుచూడాల్సిన విషయం! అని మహేష్ ఇచ్చిన సమాధానం అభిమానుల్లో ఆశలను కలోగిస్తోంది.
మహేష్ నాగ్ ముందే అనుకోని ఈ తరహా ట్వీట్స్ వేశారా లేకుంటే ఎదో సరదాగా అనుకున్నారా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. మరోవైపు త్రివిక్రమ్ తో మహేష్ తదుపరి సినిమాకి సిద్ధం అవుతున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ లో ఒక పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది. మరి అది నాగార్జున కోసమేనా అని మరో డౌట్ వస్తోంది. ఏదేమైనా వీరు కలిసి సినిమా చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











