twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేనల్లుడి సినిమాపై అప్డేట్ ఇచ్చిన మహేష్.. అతను కూడా టక్కరి దొంగ స్టైల్‌లోనే..

    |

    ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక యువ హీరో టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న మహేష్ ఆ బ్రాండ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో ఫ్యామిలీకి సంబంధించిన మరొక కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

     అంచనాలకు తగ్గట్లుగానే

    అంచనాలకు తగ్గట్లుగానే

    సూపర్ స్టార్ కృష్ణ అంచనాలకు తగ్గట్లుగానే మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. ప్రతి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తున్న మహేష్ చిన్న హీరోలకు కూడా అవసరమైన సమయంలో సపోర్ట్ చేస్తుంటాడు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇండస్ట్రీలోకి సినిమా బావుంటేనే ప్రమోషన్ లోకి దిగుతాడు.

    మహేష్ మేనల్లుడు కూడా

    మహేష్ మేనల్లుడు కూడా

    బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా సొంతంగా ఎదిగే టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కుదరదని మహేష్ పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పేశాడు. ఇక మహేష్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సుధీర్ బాబు తనదైన శైలిలో విభిన్నమైన కథలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా కూడా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యాడు.

    టక్కరి దొంగ స్టైల్ లో

    టక్కరి దొంగ స్టైల్ లో

    నేడు అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అతని మొదటి సినిమా మోషన్ పోస్టర్ ను వదిలారు. అందులో అశోక్ కౌ బాయ్ లుక్కులో దర్శనమిస్తున్నాడు. ఆ టీజర్ లో మహేష్ టక్కరి దొంగ స్టైల్ లో గుర్రాన్ని పట్టుకొని వెళుతున్నట్లు ఉంది. చూస్తుంటే ఈ కుర్రాడు టాలీవుడ్ లో మరో స్టార్ హీరోగా ఎదిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    దర్శకుడు ఎవరంటే..

    ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఉగాదికి లాంచ్ చేయనున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు భలే మంచి రోజు, శమంతకమణి వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు. అలాగే నాగార్జున, నాని లతో దేవదాస్ అనే సినిమాను కూడా తెరకెక్కించాడు. మరి అశోక్ గల్లా సినిమాతో శ్రీరామ్ ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    legendary actor Superstar Krishna had also directed several classic hits such as Simhasanam, after almost a couple of decades, he has donned the director’s hat once again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X