HBD Mahesh Babu: భారీగా పెరిగిన మహేష్ బాబు ఆస్తులు.. టాలీవుడ్ శ్రీమంతుడి సంపద ఎన్ని కోట్లంటే?

సూపర్‌స్టార్ కృష్ణగారి అబ్బాయిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మహేశ్ బాబు. బాలనటుడిగానే తనెంటో ప్రూవ్ చేసుకున్న మహేశ్.. ఆ తర్వాత హీరోగా దూసుకెళ్తున్నారు. కృష్ణగారి అబ్బాయి అనే బ్రాండ్ నుంచి మహే‌శ్ బాబు తండ్రి కృష్ణ అనే రేంజ్‌కి ఎదిగారు. మాస్, క్లాస్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ నేడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడిగా నిలిచారు. ఈరోజు మహేశ్ బాబు పుట్టినరోజు .. అంతేకాదు ఈ పుట్టినరోజుకు ఓ స్పెషాలిటీ కూడా ఉంది. ఇది ఆయనకు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ బాబు కెరీర్, ఆస్తులు, ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

సూపర్‌స్టార్ కృష్ణ, ఘట్టమనేని ఇందిర దేవి దంపతులకు ఆగస్ట్ 9, 1975న చెన్నైలో జన్మించారు మహేశ్ బాబు. ఆయకు నలుగురు తోబుట్టువులు. అన్నయ్య రమేశ్ బాబు, అక్కలు పద్మావతి, మంజుల, చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మద్రాస్‌లో ఉన్నప్పటికీ మహేశ్‌కి తన బాల్యం మొత్తం తన అమ్మమ్మ దుర్గమ్మ వద్దే గడిచింది . చెన్నైలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన మహేశ్.. ప్రఖ్యాత లయోలా కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు.

Mahesh Babu Net Worth here s the SSMB29 Actor s Net Worth and Assets Details

నీడతో బాలనటుడిగా ఎంట్రీ
ఫైట్లు సహా కమర్షియల్ టచ్ లేకుండా సహజంగా ఓ సినిమా చేయాలని నిర్మాత రామినేని సాంబశివరావు కోరిక మేరకు దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన నీడలో తొలిసారి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు మహేశ్ బాబు. అప్పటికీ ఆయన వయసు నాలుగేళ్లు. ఇందులో రమేశ్ బాబు చిన్నప్పటి పాత్రను మహేశ్ బాబు పోషించారు. మహేశ్ బాబు నుదుటన బొట్టు పెట్టి ఆయన కెరీర్‌కు శ్రీకారం చుట్టారు దాసరి నారాయణ రావు. ఆ తర్వాత తన తండ్రి స్వీయ దర్శకత్వంలోనూ, మరికొన్ని సినిమాల్లోనూ బాలనటుడిగా నటించారు మహేశ్ బాబు. ఆ తర్వాత చదువు పాడవుతుందని భావించిన కృష్ణ.. కొన్నాళ్లు మహేశ్‌ను సినిమాలకు దూరం పెట్టారు.

రాజకుమారుడితో హీరోగా
1999లో అశ్వినీదత్ నిర్మాతగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు చిత్రంతో హీరోగా అడుగుపెట్టారు మహేశ్ బాబు. ఆ తర్వాత మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి సినిమాలతో టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాశాడు మహేశ్. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్ధలుకావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్ రికార్డులు
ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క రీమేక్‌లోనూ నటించకపోవడం ఓ రికార్డ్. వరుసగా 5 నంది అవార్డుల్ని అందుకున్న నటుడిగా మహేశ్ అరుదైన ఘనత సాధించాడు. 2002 నుంచి 2006 వరకు ఏడాదికో పురస్కారం అందుకుంటూనే ఉన్నారు. యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిన తొలి సినిమాగా శ్రీమంతుడితో రికార్డులు సృష్టించాడు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన తొలి టాలీవుడ్ హీరోగానూ రికార్డ్ సృష్టించాడు. టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్‌మ్యాన్‌ లిస్ట్‌లో పలుమార్లు చోటు దక్కించుకున్నారు. యూఎస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన 10 చిత్రాలు కలిగిన హీరోగా మహేశ్ నిలిచారు. అలాగే ఆయన నటించిన ఆరు చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి.

నిజమైన శ్రీమంతుడు
ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకున్న మహేశ్ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లలో ఆర్జిస్తున్నారు మహేశ్ బాబు. దేశంలోని టాప్ బ్రాండ్స్‌కు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. సినిమాలతోనే కాదు.. బిజినెస్‌లోనూ హిట్ కొట్టారు మహేశ్ బాబు. ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు సూపర్‌స్టార్. వీటితో పాటు రెస్టారెంట్స్, ది హంటర్ కో పేరుతో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను సైతం నిర్మించారు.

మహేశ్ బాబు ఆస్తులు
సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా ఏదాదికి వందల కోట్లలో సంపాదిస్తున్నారు మహేశ్ బాబు. ఆయన ఆస్తుల విలువ 400 కోట్లకు పై మాటేనని అంచనా. హైదరాబాద్‌లో మహేశ్ నివసించే మాన్షన్ విలువ 50 కోట్ల పైనే ఉంటుంది. అలాగే 7 కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్.. ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. సంపదలో శ్రీమంతుడిగా.. సామాజిక కార్యక్రమాల్లో మనసున్న మహారాజుగా మన్ననలు అందుకుంటున్న మహేశ్ బాబు .. జీవితంలో మరెన్నో విజయాలు అందుకుని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X