Mahesh Babu మెరిసిపోతున్నాడుగా.. న్యూ లుక్ ఆ దర్శకుడి కోసమేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నిత్యం ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమాకు సంబంధించిన పాటలు కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ను చూస్తూ ఉంటే తదుపరి సినిమా కోసం న్యూ లుక్ మెయింటైన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఒక బ్రాండ్ ప్రమోషన్ లో పాల్గొన్న మహేష్ న్యూ లుక్ తో కనిపించాడు ఆ వివరాల్లోకి వెళితే..

డిఫరెంట్ మాస్ లుక్
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ మాస్ లుక్కుతో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఒక షేడ్ లో క్లాస్ లుక్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే మరో క్లారిటీ వచ్చేసింది.

మహేష్ న్యూ లుక్
అయితే ఇటీవల ఒక బ్రాండ్ ప్రమోషన్ లో పాల్గొన్న మహేష్ బాబు ఊహించని లుక్ లో దర్శనమిచ్చాడు. మొన్నటి వరకు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా మహేష్ బాబు మొత్తానికి ఆ వర్క్ ను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే.
అయితే త్రివిక్రమ్ సినిమాలో మహేష్ మరో విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుత లుక్ ను గమనిస్తే మునుపటి కంటే కాస్త మహేష్ బాబు కాస్త చేంజ్ అయినట్లుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడో..
దర్శకుడు త్రివిక్రమ్ హీరోలను ఎంత స్మార్ట్ గా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఇంటిలిజెంట్ గా కూడా హైలెట్ చేస్తూ మంచి ఎలివేషన్ ఇస్తాడు. ఇక మహేష్ బాబు లాంటి హీరోను ఇదివరకే రెండుసార్లు అద్భుతంగా చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు తన తదుపరి సినిమాలో అంతకుమించి హైలెట్ హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

40లో కూడా స్మార్ట్ గా..
నాలుగు పదుల వయసు దాటినా కూడా మహేష్ బాబు ఇంకా పాతికేళ్ళ కుర్రాడి తరహాలోనే కనిపిస్తూ ఉండటం విశేషం. నేటి తరం యువ హీరోలు కూడా ఈ రేంజ్ లో గ్లామర్ ను చేయడంలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత రాజమౌళి ప్రాజెక్టులతో బిజీగా కానుంమ విషయం తెలిసిందే. అయితే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపిస్తాడు అనేది కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.
Recommended Video

రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో?
ఇప్పటివరకు స్టార్ హీరోల అందర్నీ కూడా రాజమౌళి పవర్ ఫుల్ గా చూపించాడు. అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా వారిలో చాలా మార్పులు రావడానికి దోహదపడ్డాడు. ఇక మహేష్ బాబు లాంటి స్మార్ట్ హీరోను ఎలా మారుస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాలను కూడా మహేష్ తో ఎలా చేయిస్తారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజమౌళి తో వర్క్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు అని రాంచరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఒక క్లారిటీ వచ్చేసింది. మరి మహేష్ బాబును ఎలా డీల్ చేస్తాడో తెలియాలి అంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే


Click it and Unblock the Notifications











