భీమ్లా టీమ్ తో మహేష్ బాబు.. మొత్తానికి అదిరిపోయే కాంబో సెట్టయ్యిందిగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అతి పెద్ద భారీ ప్రాజెక్టులు వెండితెరపైకి రాబోతున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా గ్యాప్ లేకుండా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక దర్శకులు సమయం దొరికితే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా ఏ అనౌన్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు భీమ్లా నాయక్ టీంతో కలిసి మొత్తానికి మరొక ప్రాజెక్టుపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మార్చిలోపు పూర్తి చేసి..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కాస్త సర్జరీ కావడంతో మహేష్ బాబు దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక్కడే మరో నెలపాటు రెస్ట్ తీసుకోనున్న మహేష్ బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత సర్కారు వారి పాట సినిమాను ఫినిష్ చేయనున్నాడు. ఆ సినిమా షూటింగ్ మార్చిలోపు పూర్తవుతుందని సమాచారం.

SVP వాయిదా
సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అసలైతే సంక్రాంతి కానుకగా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన అలాగే RRR రాధేశ్యామ్ సినిమాల కోసం మహేష్ బాబు తన సొంత నిర్ణయంతోనే సర్కారు వారి పాటను ఏప్రిల్ లోకి షిఫ్ట్ చేశాడు.

మహేష్ పాన్ ఇండియా
మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రస్తుతం అంతకుమించి అనేలా ఉండాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాకుండా రాజమౌళితో కూడా ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా పాన్ ఇండియాకు తగ్గట్లుగానే తెరపైకి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది.

భీమ్లా నాయక్ టీమ్ తో మహేష్
ఇక మహేష్ బాబు మొత్తానికి భీమ్లా నాయక్ టీమ్ తో కూడా కలిశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్న బిమ్లా నాయక్ సినిమా షూటింగ్ పనులు అన్నీ కూడా పూర్తయ్యయి. నాగ వంశీ నిర్మిస్తున్న ఆ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు కలిసి ఇటీవల మహేష్ బాబును కలిశారు. మహేష్ తో తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఫైనల్ స్క్రిప్ట్ రెడీ..
మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో సెట్ అయింది. కాకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా ఫినిష్ అవ్వకపోవడంతో మహేష్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి సందేహించాడు. ఇక ఫైనల్ గా మొత్తం కథను రెడీ చేసిన తరువాత త్రివిక్రమ్ ఇటీవల దుబాయ్ కు వెళ్లి మహేష్ బాబుకు కథను వివరించాడు. ఇక మహేష్ బాబు కూడా పూర్తి స్క్రిప్ట్ పై నమ్మకం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాను కేవలం తెలుగులోనే తెరపైకి తీసుకు వస్తారా లేకపోతే పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తారలరా? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











