Mahesh Babu: స్టైలిష్ లుక్కుతో అరాచకం.. మహేష్ బాబు అందం అంటే అట్లుంటది మరి!
అందరి వయస్సు పెరుగుతున్న కొద్ది శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఏజ్ ప్రభావం ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వయస్సు పెరుగుతున్న కూడా ఇంకా కుర్రాడిలా మారిపోతున్నాడు.
ఎప్పటికప్పుడు తన లుక్ లో వేరియేషన్స్ చూపిస్తూ అభిమానులని ఫిదా చేస్తున్నాడు. అలాగే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోతున్నాడు. ఇక రీసెంట్ గా అతను ఒక ఫొటో షూట్ లో పాల్గొన్న విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ అందం అంటే ఈ రేంజ్ లో ఉంటుంది మరి.. అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

మహేష్ 'గుంటూరు కారం': సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మాస్ కమర్షియల్ మూవీగా సూపర్ స్టార్ నుంచి మొదటిసారి పక్కా మాస్ రోల్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం కావడం విశేషం.
ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది. 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఆ రూట్లో మహేష్ మొదటి స్థానం: సూపర్ స్టార్ ని మామూలుగా చూస్తేనే చాలా సుకుమారంగా కనిపిస్తూ ఉంటాడు. ఇక మేకోవర్ అయితే అతనిలో అందం మరింతగా మెరిసిపోతూ ఉంటుంది. అందుకే ప్రముఖ కంపెనీలు అన్ని కూడా తమ ఉత్పత్తులని ప్రమోట్ చేసుకోవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒప్పందం చేసుకుంటాయి. సౌత్ లో అత్యధికంగా కమర్షియల్ యాద్స్స్ చేసే హీరోల జాబితాలో సూపర్ స్టార్ మొదటి స్థానంలో ఉంటాడు.

లేటెస్ట్ లుక్స్ వైరల్: తాజాగా మరోసారి అతని న్యూ లుక్ కి సంబందించిన ఫోటోలని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కర్లింగ్ హెయిర్ స్టైల్ తో బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని జీన్స్ టైప్ షార్ట్ వేసుకొని బటన్స్ తీసేసి లోపల బనియన్ తో స్టైలిష్ లుక్ లో ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు మహేష్ బాబు లైట్ గెడ్డంతో గ్రీకువీరుడు తరహాలో మెరిసిపోతున్నాడు. ఇలాంటి లుక్స్ కేవలం సూపర్ స్టార్ కి మాత్రమే సాధ్యం అంటూ ఫ్యాన్స్ ఆ ఫోటోలపై కామెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు.

జక్కన్న దర్శకత్వంలో బిగ్గెస్ట్ మూవీ: ఇక మహేష్ గుంటూరు కారం సినిమా తర్వాత జక్కన్న దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నాడు. ఆ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ తో సూపర్ స్టార్ కలిసి నటించబోతున్నాడు. ఇక రాజమౌళి సినిమాతో సూపర్ స్టార్ అందం, ఆకర్షణ ప్రపంచ దృష్టికి రీచ్ అవ్వడం పక్కా అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ అసలు కథ ఫైనల్ అయినట్లు టాక్. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో రాజమౌళి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











