సానియాతో మహేష్‌బాబు సెలబ్రేషన్స్.. పబ్‌లో ప్రిన్స్ ఎలా డ్యాన్స్ చేశారో చూడండి.. (వీడియో)

సినీ కెరీర్‌ విషయంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో.. ఫ్యామిలీ విషయంలో అంతే ప్రేమగా ఉంటారు. సినిమా షూటింగ్ బిజీ ఎంతున్నా ఏడాదికి రెండుసార్లు ఫ్యామిలీతో టూర్లు కొట్టేస్తుంటారు. భార్య, పిల్లలతో చక్కగా సమయాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల కోసం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆత్మీయ అతిథులు కలిశారు. వారు ఎవరంటే..

దుబాయ్‌లో ప్రిన్స్ సెలబ్రేషన్స్

దుబాయ్‌లో ప్రిన్స్ సెలబ్రేషన్స్

దుబాయ్‌లో కుమారుడు గౌతమ్, కూతురు సితార, భార్య నమ్రతతో ప్రిన్స్ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అయితే దుబాయ్‌లో వారికి సానియా మిర్జా, ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కలిశారు. వారితో కలిసి న్యూఇయర్ వేడుకలును జరుపుకొన్నారు.

నమత్ర శిరోద్కర్ ఇన్స్‌టాగ్రామ్‌లో

నమత్ర శిరోద్కర్ ఇన్స్‌టాగ్రామ్‌లో

సానియా మిర్జా, షోయబ్ మాలిక్, తదితరులతో గౌతమ్, సితార, మహేష్, నమ్రతా కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను ఫొటోలో బంధించారు. ఆ ఫోటోను నమ్రత శిరోద్కర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఫన్ ఇవెనింగ్స్ అంటూ కామెంట్ చేశారు. పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే 60 వేలకుపైగా లైకులు వచ్చాయి.

పబ్‌లో కూతురుతో కలిసి

న్యూ ఇయర్‌ సందర్భంగా తన కూతురు సితారతో కలిసి మహేష్ బాబు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. పబ్‌లో మ్యూజిక్ బీట్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయమని సితార చేసిన మారాం ఆకట్టుకొనేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

మహర్షి సినిమా షూట్‌లో

మహర్షి సినిమా షూట్‌లో

న్యూ ఇయర్ సెలబ్రేషన్ తర్వాత మహేష్ మళ్లీ సినిమా షూటింగ్‌తో బిజీగా మారిపోయారు. తన కెరీర్‌లో 25వ చిత్రంగా వస్తున్న మహర్షి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X