twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజృంభణ, విలయతాండవం.. వాటిని నమ్మెద్దు.. మహేష్ బాబు వార్నింగ్

    |

    ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న సమయంలో ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పేదలకు ఆర్థికంగాను, సామాజికంగాను సహాయం చేయడానికి సిద్దమయ్యారు. ప్రతీ రోజు ప్రజలను, అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రెండు వారాల లాక్‌డౌన్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజలకు, వైద్యులకు, పోలీసుల సేవలను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్స్‌లో ఏమన్నారంటే..

    కరోనాపై పోరాటంపై

    కరోనాపై పోరాటంపై

    రెండు వారాల లాక్‌డౌన్ కాలంలో మనమంతా మానసికంగా చాలా బలంగా కనిపించాం. మన ప్రభుత్వాలు సమిష్టిగా తీసుకొన్న చర్యలు అభినందనీయం. కరోనాపై పోరాటాన్ని చూస్తూ మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకొని ఈ ప్రపంచ ఆరోగ్యదినంను జీవితంలో మరిచిపోలేని విధంగా మలచుకొందాం అని సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్నారు.

    పోలీసులు, డాక్టర్లు భేష్

    పోలీసులు, డాక్టర్లు భేష్

    కరోనావైరస్‌పై పోరాటానికి రోడ్లపై డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు, ఇతర అధికారులు, అలాగే తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి వైద్య చేస్తున్న డాక్టర్లకు మనం చేతులెత్తి మొక్కాలి. వారి సేవలను ఘనంగా కీర్తించాలి. వారందరినీ భగవంతుడు చల్లగా చూడాలి అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఫేక్ న్యూస్‌కు దూరంగా

    ఫేక్ న్యూస్‌కు దూరంగా

    కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం, పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలను పాటించడమే కాకుండా మనం మరిన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అనవసరపు వార్తలు, ఫేక్ న్యూస్‌కు భయపడకుండా ఫియర్ డిస్టెన్స్‌ను కూడా అలవాటు చేసుకోవాలి అని మహేష్ బాబు సూచించాడు.

    Recommended Video

    Jagapathi Babu Opens Up On The Affair With Soundarya

    తప్పుడు వార్తలను నమ్మెద్దు..

    కరోనా ఓ వైపు విజృంభిస్తుంటే.. మరో పక్క అంతకంటే దారుణంగా ఫేక్ న్యూస్ విలయతాండవం చేస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలి. వాటిని నమ్మకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మానవత్వం, ప్రేమ, సానుకూలతను ప్రజల్లో పెంచాలి. తప్పకుండా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడం ఖాయం. మీరంతా ఇంటి పట్టునే క్షేమంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Super star Mahesh Babu reacted on Covid19 pendemic. After two weeks of Lackdown, He reacted on twitter and praises Health, Police officials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X