మహేశ్ బాబుపై బాలీవుడ్ హీరో ప్రశంసలు..ఆనందంలో బిగ్ బ్రదర్ అంటూ పోస్ట్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయమై... ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. హ్యాండ్సమ్‌ లుక్‌తో పాటు అద్భుతమైన టాలెంట్‌తో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. హిట్‌తో పొంగిపోకుండా... ఫ్లాఫ్‌ వచ్చినప్పుడు క్రుంగిపోకుండా ముందడుగు వేస్తున్నాడు. సినిమాలకు సమాంతరంగా వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌కు చెందిన ఓ హీరో మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు.

మహేశ్ బాబు ఓ కూల్ డ్రింక్‌ సంస్థకు బ్రాండ్ అంబాసీడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దానికే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ప్రకటనల కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు ఈ స్టార్ హీరోలు. ఇప్పటి వరకు తెలుగులో మహేశ్ బాబు.. హిందీలో రణ్‌వీర్ యాడ్లు చేస్తూ వచ్చారు. అయితే, తొలిసారి వీళ్లిద్దరి కలయికలో ఓ వీడియోను షూట్ చేశారట. ఇందుకోసం వీళ్లిద్దరూ కలిసి కొద్ది రోజులు ట్రావెల్ చేశారు. దీన్ని ప్రస్తావిస్తూ రణ్‌వీర్ తాజాగా తన సోషల్ మీడియాలో మహేశ్ బాబుతో కలిసున్న ఫొటోను షేర్ చేశాడు.

Mahesh Babu Plan Bollywood Entry With Sarkaru Vaari Paata

అంతేకాదు.. ఆ పోస్టులో 'నేను ఇప్పటి వరకు కలిసి పని చేసిన వారిలో మహేశ్ బాబు నిజమైన జెంటిల్‌మెన్. మా ఇద్దరి సంభాషణలు ఎప్పుడూ సంతోషాన్నిస్తాయి. బిగ్ బ్రదర్ మహేశ్ బాబు గారి పట్ల ఎప్పటికీ ప్రేమ గౌరవం ఉంటుంది' అని అందులో రాసుకొచ్చాడు. రణ్‌వీర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. అలాగే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X