యువ హీరోలతో బిజీ కానున్న మహేష్.. నిర్మాతగా కొత్త సినిమాలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు కథలను సేఫ్ జోన్ లో సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అదే విధంగా ఆదాయాన్ని పెంచుకోవడంలో కూడా అలానే ఆలోచిస్తుంటాడు. అసలు ఆలోచన ఆయన సతీమణిదే అయినా మహేష్ ఆలోచన విధానం కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో సర్కారు వారి పాట సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బయట హీరోలతో కూడా వర్క్ చేసేందుకు మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

సూపర్ స్టార్ క్రేజ్..
మహేష్ క్రేజ్ రోజురోజుకి అంచనాలను మించిపోతోంది. ఇటీవల సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రాగానే ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దెబ్బకు ట్విట్టర్ లో పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. మహేష్ పేరు కనిపిస్తే చాలు ఆడియెన్స్ ఒక లెవెల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీజర్ సాంగ్స్ వస్తే ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో ఉహించడానికే వీలు పడటం లేదు.

నిర్మాతగా బిజీ అవ్వాలని..
ఇక నెక్స్ట్ నిర్మాతగా కూడా మహేష్ బిజీ కానున్నాడు. ఇప్పటికే స్టైలిష్ బిజినెస్ లను స్టార్ట్ చేసిన మహేష్ AMB పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దారుల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటున్న మహేష్ నెక్స్ట్ నిర్మాతగా కూడా బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. పెద్ద సినిమాలను కాకుండా చిన్న బడ్జెట్ లోనే సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే మేజర్..
ఇప్పటికే మహేష్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ తో మేజర్ అనే ఒక సినిమాను పట్టాలెక్కించాడు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నెక్స్ట్ మహేష్ మరికొంత మంది యువ హీరోలను కూడా లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ హీరోలతో..
మహేష్ సినిమాలతో బిజీగా ఉండడంతో నమ్రత ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకుంది. మహేష్ GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మహేష్ ప్రతి సినిమాకు కో ప్రొడక్షన్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో విజయ్ దేవరకొండ, కార్తీ వంటి హీరోలతో కూడా కొత్త తరహా సినిమాలను మహేష్ నిర్మించనున్నాడట. మరి ఆ సినిమాలు ఎప్పుడు తెరపైకి వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











