సినిమా వాళ్లకు కూడా వ్యాక్సినేషన్: మహేశ్ బాబు అదిరిపోయే ఐడియా
కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారు అవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఖర్చుకు వెనకాడకుండా దీన్ని రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి కరోనా రూపంలో అడ్డంకి వచ్చింది. దీంతో మహేశ్ అదిరిపోయే ప్లాన్ వేశాడని తెలిసింది.
'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేయగా.. కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పడు జూలై నుంచి దీన్ని పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సినిమా యూనిట్ మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని ప్లాన్ చేశాడట. అందుకు అనుగుణంగానే ఓ రోజు దీన్ని నిర్వహించాలని ఏర్పాట్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ తన దత్తత గ్రామాల్లోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయించిన విషయం తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











