పన్నెండో నెలలోనూ మహేషే నెం.1.. అల్లు అర్జున్ కి రిలీజ్ నెలలోనే షాక్.. షాకింగ్ గా మారిన సర్వే ఫలితాలు!

పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, సినిమా, టీవీ రంగాలలో అనేక సర్వేలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నవంబర్ నెలకు గాను టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు హీరోగా మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్ ను బీట్ చేసి ప్రభాస్ రెండో స్థానానికి చేరారు. ఇంకా ఆ జాబితాలో కొందరి స్థానాలు మాత్రం మారాయి, ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే..

మహేష్ 2-అల్లు అర్జున్

మహేష్ 2-అల్లు అర్జున్


పాపులర్ సర్వ్ కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన రికార్డు సృష్టించారనే చెప్పాలి. వరుసగా పదకొండు నెలల నుంచి ఆయనే మొదటి స్థానంలో ఉంటున్నారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా ఏప్రిల్ నెలకు వాయిదా పడింది. ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ గత నెలలో రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు ఆయన స్థానాన్ని ప్రభాస్ కైవసం చేసుకున్నాడు. ఆయన మూడవ స్థానంలో ఉండగా అక్కడి నుంచి రెండో స్థానానికి ఎగబాకారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇవి కాక ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్ 4- అల్లు అర్జున్

ఎన్టీఆర్ 4- అల్లు అర్జున్


ఇక ఈ జాబితాలో ఎన్టీఆర్ ఐదవ స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. ఇక గత నెలలో రెండో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ప్లేస్ అయితే బాగా దిగజారింది. చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం పుష్ప ఈ నెల 17న విడుదల అవుతుంది.

 పవన్ కళ్యాణ్ 6-రామ్ చరణ్

పవన్ కళ్యాణ్ 6-రామ్ చరణ్

ఇక పవన్ కళ్యాణ్ నాలుగో స్థానం నుంచి ఐదవ స్థానానికి దిగజారారు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు మాత్రం సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ జాబితాలో రామ్ చరణ్ ఆరో స్థానానికి నిలబెట్టుకున్నారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఆచార్య లో కూడా ఆయన నటిస్తున్నారు.

 7-విజయ్ దేవరకొండ 8-నాని

7-విజయ్ దేవరకొండ 8-నాని

ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానం నుంచి ఏడవ స్థానానికి ఎగబాకారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి దిగజారారు. గత నెలలో ఆయన ఏడవ స్థానంలో ఉండగా ఇప్పుడు ఎనిమిదో స్థానానికి చేరారు. చివరిగా టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాతో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

9- చిరంజీవి, 10-నాగచైతన్య

9- చిరంజీవి, 10-నాగచైతన్య

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో పదవ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకారు. చివరిగా ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటించగా ఆ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. అదొక్క సినిమా కాకుండా ఆయన నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. సెప్టెంబర్ నెల జాబితాలో చోటు సంపాదించినా నాగచైతన్య అక్టోబర్ నెలలో తొమ్మిదో స్థానం సంపాదించగా ఇప్పుడు పదో స్థానానికి దిగజారాడు. సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతూ ఇప్పుడు పదో స్థానం సంపాదించారు. ఆ తర్వాత ఆయన విడాకుల ప్రకటనతో ఒక స్థానం పైకి ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. మళ్ళీ ఇప్పుడు వెనుకపడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X