నెపొటిజం ఎఫెక్ట్: ముందు జాగ్రత్తలో మహేష్.. సోలోగా వచ్చిన హీరోలతో మినీ బడ్జెట్ సినిమాలు!

ఒక్క యువ హీరో సూసైడ్ కేసు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలలోని చీకటి రహస్యాలను బయటపెడుతోంది. వారసత్వం అనే ట్యాగ్ ఇప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. నెపొటిజంఅనే పదం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఆ పదం మరకను చూసి భయపడుతున్న కొంతమంది స్టార్స్ ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వారసత్వ భయం..

వారసత్వ భయం..

సుశాంత్ సింగ్ మరణం తరువాత వారసత్వం నుంచి వచ్చిన స్టార్స్ పై నెగిటివ్ కామెంట్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. గతంలో కూడా నెపొటిజం పై కామెంట్స్ వచ్చినప్పటికీ ఈ స్థాయిలో అయితే వైరల్ కాలేదు. దీంతో ఆ దారి నుంచి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఎదో ఒక విదంగా న్యూ టాలెంట్ ని సపోర్ట్ చేయాలని కొందరు ట్రై చేస్తున్నారు.

మహేష్ కౌంటర్ స్టెప్..

మహేష్ కౌంటర్ స్టెప్..

సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ సొంతంగా ఎదిగేవారిని స్టార్ హీరోలు తొక్కేయడానికి ట్రై చేస్తుంటారు అనే నెగిటివ్ కామెంట్ కి కౌంటర్స్ ఇచ్చేలా మహేష్ అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మహేష్ కొంత మంది కుర్ర హీరోలతో సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నాడు.

 GMB ప్రొడక్షన్ లోనే..

GMB ప్రొడక్షన్ లోనే..

ఇప్పటికే మహేష్ తన GMB ప్రొడక్షన్ లో అడివి శేష్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. 26/11 ముంబై ఎటాక్స్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే ప్రొడక్షన్ లో మరికొంత మంది హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు.

శర్వానంద్ కోసం..

శర్వానంద్ కోసం..

యువ హీరో శర్వానంద్ కోసం ఒక లవ్ స్టోరీని సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. శర్వానంద్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చేలా మహేష్ ఒక సినిమాను ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు. దాదాపు స్క్రిప్ట్ పనులని పూర్తయినట్లు తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని
విజయ్ దేవరకొండతో కూడా..

విజయ్ దేవరకొండతో కూడా..

అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా చేయాలని మహేష్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. విజయ్ అంటే మహేష్ బాబుకు చాలా ఇష్టం. సొంతంగా పైకొచ్చిన హీరో అంటూ గతంలోనే చాలా సార్లు పొగిడాడు. అలాంటి హీరోతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలని సరైన స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. మరి మహేష్ కి ఈ ప్లాన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X