మహేశ్ బాబు అదిరిపోయే రికార్డ్: పవన్‌కు బిగ్ షాక్.. అగ్రస్థానంలో ప్రభాస్‌.. ఏ హీరో ర్యాంక్ ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు స్టార్లుగా వెలుగొందుతున్నారు. అందులో చాలా మంది తమ తమ ఫ్యాన్ బేస్‌ను మరింత ఎక్కువగా పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకటి. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు మహేశ్ బాబు. ఆ సంగతులు చూద్దాం పదండి!

సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్టార్స్

సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న స్టార్స్

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన స్టార్లంతా వీటి ద్వారానే తమకు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తున్నారు. ఇందుకు గానూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా పలు రకాల సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తున్నారు. వీటిని ఫ్యాన్స్ అనకరిస్తున్నారు. ఇలా చాలా మంది రికార్డు స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

ఫేస్‌బుక్‌లో అరుదైన మార్కును చేరుకుని

ఫేస్‌బుక్‌లో అరుదైన మార్కును చేరుకుని

ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమాల పరంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అతడు.. సోషల్ మీడియాలోనూ అదే రీతిలో అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో 15 మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. దీంతో మూడో స్థానంలో నిలిచాడు.

మొదటి స్థానంలో ప్రభాస్.. రెండోది బన్నీనే

మొదటి స్థానంలో ప్రభాస్.. రెండోది బన్నీనే

మిగిలిన సామాజిక మాధ్యమాలతో పోలిస్తే ఫేస్‌బుక్‌ చాలా రోజుల ముందు నుంచే ఉంది. అందుకే సినీ ప్రముఖులంతా ఇందులోనే ఖాతాలను ఓపెన్ చేశారు. ఇక, టాలీవుడ్‌ విషయానికి వస్తే.. ఫేస్‌బుక్‌లో ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకున్న హీరోల జాబితాలో రెబెల్ స్టార్ ప్రభాస్ (24 మిలియన్లు) మొదటి స్థానంలో, అల్లు అర్జున్ (21 మిలియన్లు) రెండో స్థానంలో ఉన్నారు.

పదిని దాటేసిన మరో ఇద్దరు స్టార్ హీరోలు

పదిని దాటేసిన మరో ఇద్దరు స్టార్ హీరోలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు మూడో స్థానంలో ఉండగా.. పది మిలియన్ల మార్కును దాటిన మరో ఇద్దరు హీరోలు ఉన్నారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 12 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా పది మిలియన్ల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న హీరోల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

సెకెండ్ గ్రేడ్ హీరోలలో ఎవరు ఎంత మంది?

సెకెండ్ గ్రేడ్ హీరోలలో ఎవరు ఎంత మంది?

టాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ 6 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నాడు. అతడి కంటే మీడియం రేంజ్ హీరోగా పేరొందిన నాని (7 మిలియన్లు) ముందున్నాడు. ఈ జాబితాలో నితిన్ 6 మిలియన్లు, దగ్గుబాటి రానా 4 మిలియన్లు, రామ్ పోతినేని 3.9 మిలియన్లు, వరుణ్ తేజ్ 3 మిలియన్లు, సాయి ధరమ్ తేజ్ 2.7 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

సీనియర్ హీరోలు ఏ రేంజ్‌లో ఉన్నారంటే?

సీనియర్ హీరోలు ఏ రేంజ్‌లో ఉన్నారంటే?


తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల విషయానికి వస్తే.. ఇందులో ఊహించని విధంగా అక్కినేని నాగార్జున అందరి కంటే ముందు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయనకు 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక, నందమూరి బాలకృష్ణ ఫేస్‌బుక్‌ ఫాలోవర్లలో ఒక మిలియన్‌కు చేరువలో ఉన్నారు.

Recommended Video

Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
ఈ జాబితాలో పవన్ కల్యాణ్‌కు భారీ షాక్

ఈ జాబితాలో పవన్ కల్యాణ్‌కు భారీ షాక్

ఫేస్‌బుక్‌లో ఎక్కువ ఫాలోవర్లను అందుకున్న హీరోల జాబితాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందరి కంటే చివరన ఉన్నాడు. హీరోగా, నాయకుడిగా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన.. ఫేస్‌బుక్‌లోనూ తరచుగా పోస్టులు పెడుతూనే ఉంటాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ ఎక్కువ ఉండాలి. కానీ, ఊహించని విధంగా ఈ మెగా హీరోకు కేవలం 7 లక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X