అల్లు అర్జున్ రివ్యూపై మహేష్ బాబు రియాక్షన్.. స్పెషల్ గా థాంక్యూ అంటూ..
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే సోషల్ మీడియాలో అభినందిస్తూ ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా మరికొన్ని సందర్భాల్లో చిత్ర యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా కలుసుకొని మరి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఇక ఇటీవల మేజర్ సినిమా చిత్ర యూనిట్ పై కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అల్లు అర్జున్ అభినందనలను అందించారు. అందుకు మహేష్ బాబు కూడా రియాక్ట్ అవ్వడం విశేషం.
ప్రస్తుతం వీరికి సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక సినిమా రిజల్ట్ పై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ప్రత్యేకంగా స్పందించడం విశేషం.

రీసెంట్ గా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా తన దైన శైలిలో ఒక రివ్యూ కూడా ఇచ్చాడు. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఈ సినిమా కోసం కష్టపడిన విధానం వెండితెరపై కనిపించింది అని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకం గా నిలుస్తుంది అని అన్నారు. ఫైనల్ గా సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పనితనాన్ని మెచ్చుకుంటూ వారికి స్పెషల్ గా విషెస్ అందించారు.
అయితే అల్లు అర్జున్ అలా ట్వీట్ చేయడంతో నిర్మాత మహేష్ బాబు కూడా తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమాను సోని పిక్చర్స్ తో పాటు మహేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే. థాంక్యూ అల్లుఅర్జున్ అంటూ ఈ మాటల యువ టీమ్ కు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని.. మీరు సినిమాను చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నట్లుగా మహేష్ బాబు ట్విట్టర్లో ప్రతిస్పందించారు. ఇక వీరు ట్వీట్స్ చేసుకోవడంతో ఇరు వర్గాల అభిమానులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











