For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈర్ష్యగా అనిపిస్తుందన్న ఎన్టీఅర్, ఆయన ముందే పూరీకి ఊహించని షాక్ ఇచ్చిన మహేష్ బాబు!

  |

  తెలుగు సినీ జనం ఎంతగానో ఎదురు చూస్తున్న "ఎవరు మీలో కోటీశ్వరులు" గేమ్ షో చివరి ఎపిసోడ్ అదేనండీ మహేష్ బాబు స్పెషల్ ఆదివారం నాడు ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేయగా షోలో ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ లోనే పూరి జగన్నాథ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  కూతురిపై ప్రశంసలు

  కూతురిపై ప్రశంసలు

  ఈ ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు రాబట్టిన ఎన్టీఆర్ ఒక సందర్భంలో మహేష్ ని చూస్తే తనకు ఈర్ష్యగా ఉంటుందని అన్నారు. అసలు విషయం ఏంటంటే షోలో భాగంగా మహేష్ తన కూతురు సితారతో తన బంధాన్ని పంచుకున్నాడు. "సితారతో నా సంబంధం రోజురోజుకు మరింత బలపడుతోంది, తండ్రి కావడం చాలా గొప్ప అనుభూతి. సితారతో తండ్రిగా ప్రతి క్షణాన్ని ఆనందిస్తా'' అంటూ తన కూతురిపై ప్రశంసలు కురిపించారు.

  ఈర్ష్యగా అనిపిస్తుందని

  ఈర్ష్యగా అనిపిస్తుందని

  అయితే ఇదంతా చూసిన ఎన్టీఆర్... కూతుళ్లు ఉన్న వాళ్లను చూస్తే తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని వెల్లడించారు. తనకు ఇద్దరు మగపిల్లలు కావడంతో కూతురు లేకపోవడం కాస్త వెలితిగా అన్పిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. అయితే అసలు తండ్రి కావడమే గొప్ప విషయం కాబట్టి ఇందులో సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేడని చెప్పుకొచ్చారు.

  . వీడియో కాల్ ఎ ఫ్రెండ్ అనే ఆప్షన్

  . వీడియో కాల్ ఎ ఫ్రెండ్ అనే ఆప్షన్

  ఇక ఇదే షోలో తన దర్శకులపై ఉన్న నమ్మకాన్ని బయట పెట్టారు. వీడియో కాల్ ఎ ఫ్రెండ్ అనే ఆప్షన్ వినియోగించుకునేందుకు మహేష్ జాబితాలో మొత్తం తనతో పనిచేసిన దర్శకులనే ఎంచుకున్నారు. కొరటాల శివ, పూరి జగన్నాధ్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు వంశీ పైడిపల్లి... ఈ అయిదుగురి పేర్లు స్క్రీన్ పై తారసపడ్డాయి. ఈ అయిదుగురు దర్శకులలో ఒక్క పూరి జగన్నాథ్ పేరు ఉంటుందని చాలా మంది అనుకోల్డు.

  హిట్స్ లో ఉంటేనే

  హిట్స్ లో ఉంటేనే

  ఎందుకంటే ఒక సందర్భంలో మహేష్ పై టంగ్ స్లిప్ అయిన పూరీపై సూపర్ స్టార్ అభిమానులు చాలా రోజులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పైసా వసూల్ ప్రమోషన్స్ టైంలో మహేష్ తో సినిమా ఎప్పుడు అంటే ఆయన హిట్స్ లో ఉంటేనే డైరెక్టర్ కు డేట్స్ ఇస్తారని అనడం సంచలనం రేపింది. అప్పటినుండి పూరీ కూడా సూపర్ స్టార్ కు దూరంగా ఉన్నారు.

  పూరీ గారి స్టైల్ లో

  పూరీ గారి స్టైల్ లో

  కానీ ఇలాంటి చిన్న విషయాలు మహేష్ కు పిచ్చ లైట్ అనే విషయం కొద్దీ రోజుల్లోఇనే తేలింది. పూరీ పుట్టినరోజు నాడు కూడా మహేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపగా, తాజాగా ఫ్రెండ్ జాబితాలో పూరీ పేరును చేర్చడం విశేషం. అంతేకాదు ఈ షోలో 'సర్కార్ వారి పాట' సినిమా గురించి స్పందిస్తూ... ఇది పూరీ గారి స్టైల్ లో ఉంటుందని, 'పోకిరి' వైబ్స్ ఉంటాయి అని స్వయంగా మహేష్ ప్రస్తావించారు.

  Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
  ఇదే నిదర్శనం

  ఇదే నిదర్శనం

  ఇక మా బంగారు మహేష్ బాబు వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమని సూపర్ స్టార్ అభిమానులు పూరి జగన్నాధ్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో మహేష్ నుంచి ఇది ఊహించని పూరీకి కూడా ఒక రకంగా షాక్ లాంటిది అని కొందరు అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన "పోకిరి, బిజినెస్ మెన్" ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్.

  English summary
  Mahesh babu recollects puri jagannadh working style in evaru meelo koteeswarulu show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion