మహేష్ బాబు కోసం మరో తమిళ దర్శకుడి ప్రయత్నాలు.. రిస్క్ ఎందుకని షాకింగ్ డిసిషన్!
మహేష్ బాబుతో సినిమా చేయాలని టాలీవుడ్ అగ్ర దర్శకులకు మాత్రమే కాకుండా తమిళ అగ్ర దర్శకులకు కూడా ఎంతో ఆశగా ఉంటుంది. ఇదివరకే మహేష్ బాబు, ఖుషి డైరెక్టర్ SJ సూర్యతో నాని అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. ఇక ఆ తరువాత మరో అగ్ర తమిళ దర్శకుడు శంకర్ కూడా మహేష్ బాబు కోసం మధ్యలో చర్చలు జరిపారు. 3 ఇడియట్స్ ను సౌత్ లో రీమేక్ చేయాలని శంకర్ మొదట విజయ్ చేసిన క్యారెక్టర్ కోసం మహేష్ ను అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ రీమేక్ సినిమాలు అసలు చేయను అని మహేష్ ఆ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు.
శంకర్ అయితే మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వర్కౌట్ కావడం లేదు. ఇక రీసెంట్ గా మరో తమిళ దర్శకుడు కూడా మహేష్ బాబుకు కథ చెప్పాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. ఖైదీ సినిమాతో తెలుగు వారిని కూడా ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ అని తెలుస్తోంది. ఈ దర్శకుడు విజయ్ తో మాస్టర్ అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది.

ఇక ప్రస్తుతం లోకేష్ విక్రమ్ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమాపై తెలుగు వారిలో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సూర్య కూడా స్పెషల్ పాత్రలో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ దర్శకుడు గతంలోనే మహేష్ బాబును కలిసి ఒక కాన్సెప్ట్ గురించి చర్చలు జరిపాడు.
ఇక మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కాస్త ఆలోచించుకునేందుకు టైమ్ అడిగాడట. కొన్నిరోజుల చర్చల అనంతరం మహేష్ బాబు అతను చెప్పిన కథతో సినిమా చేయడం రిస్క్ అని భావించి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడిని దూరం పెట్టకుండా భవిష్యత్తులో తప్పకుండా మరొక సినిమా చేద్దామని మరొక కథ ఏదైనా ఉంటే చెప్పాలని కూడా మహేష్ బాబు, లోకేష్ తో చెప్పినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











