Sarkaru Vaari Paata హైలైట్ లీక్ చేసిన మహేశ్: ఆ ఒక్క సీక్వెన్స్ గురించి చెప్పుకుంటారు అంటూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా చిత్రాలు కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడిపోయాయి. దీంతో ఈ మధ్య కాలంలోనే ఆ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇలా ఇప్పటికే కొన్ని మూవీలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రమే 'సర్కారు వారి పాట'. అనివార్య కారణాల వల్ల చాలా ఆలస్యం అయిన ఈ సినిమా గురువారమే (మే12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని ఓ హైలైట్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశాడు. ఇంతకీ ఏంటా హైలైట్? దాని గురించి మీరు కూడా తెలుసుకోండి మరి!

కమర్షియల్ మూవీతో మహేశ్ రెడీ
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌గా చేశారు.

అలాంటి కథతో వస్తున్న సినిమా
బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట' మూవీని తెరకెక్కించారు. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతే.. అప్పుడు తన తండ్రి కోసం విలన్‌ను హీరో ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అని అంటున్నారు. ఇందులో మహేశ్ పాత్ర పాత రోజులను గుర్తు చేసేలా ఉంటుందట.

మహేశ్ ఫ్యాన్స్ సందడి.. ట్రెండ్
వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మూవీ విడుదలపై చాలా రోజుల పాటు సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మే 12న రిలీజ్ చేస్తున్నారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫీవర్ మొదలైంది. అలాగే, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఇది హవా చూపిస్తోంది. దీంతో ఈ మూవీ ట్రెండ్ అవుతోంది.

ప్రమోషన్స్.. ఇంటర్వ్యూ బిజీగా
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' మరో రోజులోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి. ఇక, మహేశ్ బాబు కూడా తీరిక లేకుండా వరుసగా పలు చానెళ్లతో చిట్ చాట్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

సర్కారు వారి పాట హైలైట్ లీక్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన మహేశ్ బాబు.. ఈ సినిమాలో ఎన్నో హైలైట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో గోవా ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంటుందని అసలు మేటర్‌ను లీక్ చేసేశాడు.

ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే కష్టంగా
మీడియా చిట్ చాట్‌లో మహేశ్ బాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు సూపర్‌గా కంపోజ్ చేశారు. ఇందులో గోవా ఫైట్ హైలైట్‌గా ఉండబోతుంది. దీని కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గట్లుగానే ఇది ఎంతో బాగా వచ్చింది. రేపు సినిమా చూసిన మీరే చెబుతారు' అంటూ వివరించాడు.


Click it and Unblock the Notifications











