Balakrishna's Unstoppable టాప్ డైరెక్టర్ కూతుళ్లకు ఆటోగ్రాఫ్ నిరాకరించిన మహేష్.. కారణం ఏమిటంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి నిర్వహించిన టాక్ షో అన్‌స్టాపబుల్ చిత్రం భారీ సక్సెస్‌ను సాధించింది. తొలి సీజన్‌లో ఎంతో మంది ప్రముఖులను షోకు రప్పించి వారి నుంచి రాబట్టిన సమాధానాలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకొన్నది. అయితే 11 ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ ముగిసింది. అయితే చివరి ఎపిసోడ్‌ను సూపర్ స్టార్ మహేష్‌తో ముగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణతో మహేష్ బాబు మాట్లాడుతూ..

బాలకృష్ణపై అభిప్రాయాలు తారుమారు..
నటుడిగా నందమూరి బాలకృష్ణకు అభిమానుల్లో ఓ విభిన్నమైన ఇమేజ్, అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన గురించి మదిలో ఉన్న అనుమానాలు, అభిప్రాయాలు Unstoppable షోతో పంటాపంచలైపోయాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, మాట తీరు కొత్తగా కనిపించాయి. Unstoppable కు ముందు బాలకృష్ణ వేరు.. Unstoppable తర్వాత బాలకృష్ణ వేరు అనే అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా మరెంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్‌తో
ఇక ఇమేజ్‌ను పక్కన పెడితే.. బాలకృష్ణ హోస్ట్‌గా ప్రారంభమైన అన్‌స్టాపబుల్ దేశవ్యాప్తంగా రికార్డుస్థాయి రేటింగ్‌ను సాధించింది. జాతీయ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే టాక్ షోలు, రియాలిటీ షోలకు ధీటుగా అత్యుత్తమ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో Unstoppable షోపై అందరి దృష్టి నెలకొన్నది. దేశంలోనే టాప్ షోలలో ఒకటిగా నిలిచింది.

ముగింపు ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎమోషనల్‌గా
ఇక చివరి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎమోషనల్‌గా కనిపించారు. ముగింపు ఎపిసోడ్ కావడంతో హోస్ట్‌ల గురించి.. అలాగే తన టాక్ షో ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన మరుపురాని ప్రయాణం గురించి చెబుతూ అనుభవాలను పంచుకొన్నారు. అలాంటి అనుభూతుల మధ్య మహేష్ బాబును వేదికపైకి పిలిచి ఆలింగనం చేసుకొన్నారు.

మహేష్ గురించి మెహర్ రమేష్
టాక్ షోలో కొరటాల శివ, మెహర్ రమేష్, అనిల్ రావిపూడిని పిలిచి మహేష్ గురించి మాట్లాడారు. ముంబైలో మహేష్ బాబుతో జరిగిన సంఘటనను ఈ సందర్భంగా మెహర్ రమేష్ గుర్తు చేశాడు. ముంబై మారియట్ హోటల్‌లో మహేష్ బాబు బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. అయితే తాను ఫ్యామిలీతో ఉన్నాను. ఆటోగ్రాఫ్ ఇప్పుడు ఇవ్వడం కుదరదు అని వారిని మహేష్ తిప్పి పంపించాడు అని మహేష్ గురించి మెహర్ రమేష్ తెలిపారు.

డైరెక్టర్ శంకర్ కూతుళ్లకు ఆటోగ్రాఫ్
ఇక దర్శకుడు మెహర్ రమేష్ చెప్పిన సంఘటనను గుర్తు చేసుకొన్నారు. ఆ రోజు వారిని తిప్పి పంపిన తర్వాత రమేష్ వచ్చి ఆ అమ్మాయిలు డైరెక్టర్ శంకర్ కుమార్తెలు. ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సి ఉండాల్సిందని అన్నాడు. దాంతో నేను వెళ్లి శంకర్ గారిని కలిసి.. ఆ విషయం చెప్పాను. అందుకు శంకర్ స్పందిస్తూ.. పర్వాలేదు. వారికి హీరోలు అంటే ఎలా ఉంటారో అనే విషయం తెలిసిందని అన్నారు. అలా శంకర్ కూతుళ్లకు ఆటోగ్రాఫ్ ఇచ్చాను అని మహేష్ బాబు తెలిపారు.
మహేష్, బాలకృష్ణ మధ్య ఆసక్తికరమైన విషయాలు
ఇక మహేష్ బాబు, బాలకృష్ణ మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చాయి. కృష్ణ, ఎన్టీఆర్ కుటుంబాలకు సంబంధించిన విషయాలు, వారి చిన్నతనం, సినిమాల్లో నటించిన విషయాలను గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీలయ్యారు. ఇప్పటి వరకు బాలకృష్ణ, మహేష్ బాబు గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వెలుగు చూశాయి. ఆ షోకు సంబంధించిన మరిన్ని విషయాల గురించి తెలుగు ఫిల్మీబీట్‌ను ఫాలో అవుతూ ఉండండి.


Click it and Unblock the Notifications











