ఆ వ్యాధితో ఏళ్ల పాటు బాధపడిన మహేశ్ బాబు.. భర్త కోసం నమ్రత ఏం చేసిందంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిలకు అయితే కలల రాకుమారుడు. మహేశ్ అనే పేరులోని ఆ వైబ్రేషన్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్న మహేశ్ బాబు ఇంకా అందంగా యవ్వనంగా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఆయన మెయింటేన్ చేసే డైట్, ఫాలో అయ్యే వర్కౌట్స్. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఏళ్లపాటు కొనసాగుతున్న మహేశ్ బాబును ఒక వ్యాధి సతమంత చేసిందట. మహేశ్ బాబు బాధను చూడలేక ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఏం చేసిందో తెలిపాడు మహేశ్ బాబు.

భారీ హిట్లు:బాల నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవా చాటాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Mahesh Babu Reveals He Suffered With Migraine For Long Years

బర్త్ డే విషెస్:ప్రస్తుతం మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా మహేశ్ బాబు పుట్టినరోజు నేడు (ఆగస్టు 9). దీంతో ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో ఆ వ్యాధి:ఇదిలా ఉంటే మహేశ్ బాబు నచ్చినవన్నీ తినేసి జిమ్ లో కష్టపడరు. జంక్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ జోలికే వెళ్లకుండా చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంటారు. అలాగే ఏం తినట్లేదు కదా అని ఊరికే కూర్చోరు. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లి చెమటోడుస్తారు. బ్రేక్ ఇవ్వకుండా అలా పదేళ్లుగా జిమ్ చేస్తున్నారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మహేశ్ బాబు గతంలో మైగ్రేన్ (Migraine) సమస్యతో ఏళ్లపాటు ఇబ్బంది పడ్డారట.

Mahesh Babu Reveals He Suffered With Migraine For Long Years

నయం కానీ వ్యాధి:తాను కొన్నేళ్లు మైగ్రేన్ తో బాధపడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబే స్వయంగా చెప్పుకొచ్చాడు. "నేను చాలా కాలం మైగ్రేన్ తో బాధపడ్డాను. అప్పుడు నొప్పి తగ్గడానికి చాలా పెయిన్ కిల్లర్ ట్యాబెట్లు వాడాను. అసలు మైగ్రేన్ కు చికిత్స అనేది లేదని, అది నయం కానీ వ్యాధి అని చాలా మంది చెప్పారు. నా బాధ చూడలేకపోయిన నమ్రత డాక్టర్ సింధూజను కలిసింది" అని మహేశ్ బాబు తెలిపాడు.

Mahesh Babu Reveals He Suffered With Migraine For Long Years

4 గంటలే:"డాక్టర్ సింధూజను కలిసిన నమ్రత చక్రసిద్ధ నాడీ వైద్యం (Chakrasiddh Nadi Vaidyam) చేయింది. ఆ వైద్యం తర్వాత రెండు, మూడు నెలలకే మైగ్రేన్ నుంచి పూర్తి ఉపశమనం పొందాను. అప్పటి నుంచి మళ్లీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరమే రాలేదు. అంతకుముందు షూటింగ్స్ వల్ల నాలుగైదు గంటలే నిద్రపోయేవాడిని. కానీ, ఈ వైద్యం చేయించుకున్న తర్వాత రోజంతా హాయిగా నిద్రపోయాను" అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X