Mahesh: టైం రావాలనుకున్నా వచ్చేసింది.. ప్యాన్ ఇండియా సినిమా గురించి నోరు విప్పి, మహేష్ సంచలనం!

సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రకటించిన దాని ప్రకారం అయితే సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.

ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా ఈ విష్యం మీద రాజమౌళి స్పందించారు కానీ ఇప్పటిదాకా మహేష్ స్పందించలేదు. కానీ తాజా ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

 ఫామ్‌లో మహేష్ బాబు

ఫామ్‌లో మహేష్ బాబు

మహేష్ బాబు వరుస హిట్స్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

త్రివిక్రమ్ తో

త్రివిక్రమ్ తో


ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది.. కానీ రాజమౌళితో సినిమా అంటే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో ఆయన ఈ మధ్యలో త్రివిక్రమ్ తో సినిమా ఖరారు చేసుకున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా ఉంటుందని అంటున్నారు.

 జక్కన్న-మహేష్ కాంబో

జక్కన్న-మహేష్ కాంబో

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. గతేడాది లాక్ డౌన్ కి ముందు ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది. స్టోరీ ఇదని, అదని ప్రచారం జరుగుతున్నా ఎలాంటి క్లారిటీ లేదు.

ఫోర్బ్స్ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో

ఫోర్బ్స్ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో

తాజా ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ బాబు తాను పాన్-ఇండియన్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నానని వెల్లడించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని, తన భవిష్యత్ సినిమాలను పాన్-ఇండియన్ లెవల్లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నాని వెల్లడించారు.

ఆ తర్వాత ఎంకరేజ్ చేయలేదు

ఆ తర్వాత ఎంకరేజ్ చేయలేదు

మహేష్ బాబు ఇంతకు ముందు అనేక ఆసక్తికరమైన హిందీ ప్రాజెక్టులను తిరస్కరించారు. మురుగదాస్ 'స్పైడర్' వంటి సినిమా భారీ స్థాయిలో అంచనాలతో రిలీజ్ అయి పరాజయం పాలయిన తరువాత బహుభాషా ప్రాజెక్టులతో తనను సంప్రదించిన చిత్రనిర్మాతలను మహేష్ ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు ఫ్యాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ పెడుతున్నానని ఆయనే వెల్లడించారు.

Recommended Video

Anubhavainchu Raja Song Launched By Naga Chaitanya | Raj Tarun
టైం వచ్చేసింది

టైం వచ్చేసింది

దర్శకుడు రాజమౌళితో తన తదుపరి సినిమా ఉంటుందని, ఆ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని మహేష్ బాబు చెప్పారు. ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ చిత్రం బహుళ భాషల్లో రూపొందించబడుతుందని ఆయన వెల్లడించారు.

హిందీ సినిమా విషయానికి వస్తే సరైన సమయంలో సరైన సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో ఉందని అన్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నానన్నా ఆయన నా తదుపరి సినిమా రాజమౌళి సార్ తో ఉంటుందని, అది అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X