‘ఎఫ్ 2’ మూవీపై మహేష్ బాబు రివ్యూ.... ఇక ఆపడం కష్టమే!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన 'ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
తాజాగా ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సూపర్ స్టార్ నుంచి సూపర్ పాజిటివ్ రివ్యూ రాడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

వెంకీ, వరుణ్ తేజ్ అదరగొట్టారంటూ రివ్యూ
‘ఎఫ్ 2' సినిమా చూశాను. చాలా నవ్వుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేశాను. వెంకీ సర్ అద్భుతంగా నటించారు. ఫన్నీ, బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌తో అదరొట్టారు. వెంకీ సర్ టైమింగుతో మ్యాచ్ అవుతూ వరుణ్ తేజ్ కూడా బాగా నవ్వించాడు... అని మహేష్ బాబు తన రివక్యూ చెప్పుకొచ్చారు.

దర్శక నిర్మాతలపై ప్రశంసలు
ఈ సందర్భంగా మహేష్ బాబు... ‘ఎఫ్ 2 దర్శకడు అనిల్ రావిపూడిపై ప్రశంసలు గుప్పించారు. అనిల్ రావిపూడి మరో కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందించారు. దిల్ రాజు, తమన్నా, మెహ్రీన్, దేవిశ్రీ ప్రసాద్, టీమ్ మొత్తానికి అందరికీ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు రివ్యూతో పెరిగిన హైప్
మహేష్ బాబుకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువ. స్వయంగా అలాంటి వ్యక్తి నుంచి ఎఫ్ 2 సినిమా మంచి వినోద్మక చిత్రం, థియేటర్‌కు వెళితే బాగా నవ్వుకోవచ్చు అనే మాట రావడంతో ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగింది.

ఇక బాక్సాఫీసు వద్ద ప్రభంజనమే
‘ఎఫ్ 2' కంటే ముందు ‘ఎన్టీఆర్-కథానాయుడు', ‘వినయ విధేయ రామ' చిత్రాలు విడుదలైన్పప్పటికీ వాటి తర్వాత వచ్చిన ‘ఎఫ్ 2'కు ఆదరణ ఎక్కువగా ఉంది. దీంతో ఈ సంక్రాంతికి ఎఫ్2 వసూళ్ల పరంగా, లాభాల శాతం పరంగా ప్రభంజనం క్రియేట్ చేయబోతోందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











