Sarkaru Vaari Paata pre release event స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకొన్న మహేష్ బాబు.. ఏం జరిగిందంటే?

సర్కారు వారీ పాట ప్రీ రిలీజ్ వేడుకలో సూపర్‌స్టార్ మహేష్ బాబు భావోద్వేగంతో పొంగిపోయారు. మీతో ఇలా కలిసి రెండేళ్లు అయింది. మిమల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా దర్శకుడు పరుశురాంకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సర్కారు వారీ పాట సినిమాలో నా క్యారెక్టర్‌ను అద్బుతంగా డిజైన్ చేశారు. నిజం చెప్పాలంటే.. నా ఫేవరేట్ క్యారెక్టర్, నా డైలాగ్ మాడ్యూలేషన్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ ఆయన డిజైన్ చేశారు. కొన్ని సీన్లలో పనిచేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి అని మహేష్ బాబు అన్నారు. ఇంకా సూపర్ స్టార్ మాట్లాడుతూ..

పరుశురాం నాకు అలాంటి మెసేజ్

పరుశురాం నాకు అలాంటి మెసేజ్

దర్శకుడు పరుశురాం నాకు కథ చెప్పిన తర్వాత ఒకే చేశాను. ఆ తర్వాత థ్యాంక్యూ చెప్పి ఇంటికి వెళ్లి నాకు ఒక మెసేజ్ పెట్టారు. నేను ఒక్కడు సినిమా చూసి బండెక్కి డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఒక్కడు కంటే బ్లాక్‌బస్టర్ సినిమాను ఇస్తాను అని మెసేజ్ పంపాడు. థ్యాంక్యూ పరుశురాం గారు.. నాన్న గారి అభిమానులు, నా ఫ్యాన్స్‌కు మీరే నా ఫేవరేట్ డైరెక్టర్. మీరు సర్కారు వారీ పాట ఇచ్చినందుకు చాలా హ్యాపీ అంటూ పరుశురాంను కౌగిలించుకొన్నాడు.

కీర్తి సురేష్ లవ్ ట్రాక్ గురించి

కీర్తి సురేష్ లవ్ ట్రాక్ గురించి


ఇక సర్కారు వారీ పాట సినిమా విషయానికి వస్తే.. చాలా హైలెట్స్ ఉంటాయి. నాకు తెలిసి ఒక హైలెట్ ఏమిటంటే.. హీరో, హీరోయిన్ ట్రాక్. ఈ లవ్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియెన్స్ వస్తారు. నేను చెబుతున్నాను.. మీరు రాసి పెట్టుకొండి. కీర్తీ సురేష్ క్యారెక్టర్ బాగుంటుంది. ఆమె కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్యూ కీర్తీ సురేష్.. యు ఆర్ అమేజింగ్ కో స్టార్. గత రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని సార్లు డేట్స్ అడిగినా ప్రతీసారి చాలా సపోర్ట్ చేశారు అని మహేష్ బాబు అన్నారు.

తమన్‌తో గ్యాప్ గురించి మహేష్

తమన్‌తో గ్యాప్ గురించి మహేష్


తమన్‌తో గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ హ్యపీ. కళావతి పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. ఇప్పుడు తమన్ మ్యూజిక్ సెన్సేషన్. ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు పెద్ద ఫ్యాన్‌ను. నాకు తెలిసి ఈ సినిమా ఇరుగదీశాడు. నీవు చేసిన హార్డ్ వర్క్ థ్యాంక్స్ అని మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.

పోకిరిని మించిన హిట్

పోకిరిని మించిన హిట్

సర్కారు వారీ పాటకు పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్లకు థ్యాంక్స్. ఇప్పటికీ వారిద్దరిలో రామ్, ఎవరో లక్ష్మణ్ ఎవరో తెలియరు. వాళ్లలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే.. హీరోను ఎంత బాగా చూసుకొంటారో.. ఫైటర్లను కూడా అలాగే చూసుకొంటారు. శేఖర్ మాస్టర్, డీవోపీ మధి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ థ్యాంక్స్, మార్తాండ్ కే వెంకటేష్ ఎప్పుడూ పోకిరి సినిమాను దాటుతుందని సపోర్ట్ చేశాడు. ఆయనకు థ్యాంక్స్. పాటలకు అద్బుతమైన సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరాంకు థ్యాంక్స్ అని మహేష్ బాబు అన్నారు.

కంటతడి పెట్టిన మహేష్ బాబు

కంటతడి పెట్టిన మహేష్ బాబు


కోవిడ్ సమయంలో చాలా కష్టమైంది. గత రెండేళ్లలో జరిగాయి.. నాకు దగ్గరైన వారు ఎందరో దూరమయ్యారు (సోదరుడు రమేష్ బాబు, బీఏ రాజు). కొందరు దగ్గరయ్యారు. అందులో మీరు ఉన్నారు అంటూ ఫ్యాన్స్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఏది జరిగినా మీ అభిమానం మారలేదు. అలానే ఉంది. మీ అందరి సపోర్ట్‌తో ధైర్యంగా ముందుకు వెళ్లడమే అంటూ మహేష్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. కళ్లలో ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకొంటూ మహేష్ బాబు.. ఈ నెల 12వ తేదీన సర్కారు వారీ పాట వస్తున్నది. మన అందరికి ఆ రోజు పండుగే అని మహేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X