సర్కారు వారి పాటలో నెవ్వర్ బిఫోర్ అనేలా మహేష్ రోల్.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ బాక్సాఫీస్ హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయిన తరువాత మహేష్ ఒక విధంగా ఎవ్వరిని అంత ఈజీగా నమ్మడం లేదు. కొత్త దర్శకుడైనా సీనియర్ స్టార్ దర్శకుడైనా సరే పుర్తి స్క్రిప్ట్ సిద్ధమైతే గాని ఓకే చెప్పడం లేదు. ఇక గీతాగోవిందం దర్శకుడు అదే తరహాలో మెప్పించాడు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇక సినిమాలో మహేష్ నటన నెవ్వర్ బిఫోర్ అనేలా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇక యాక్షన్ సీన్స్ అయితే మరింత పవర్ఫుల్ గా ఉంటాయట.

Mahesh Babu’s body language and style is new in Sarkaru Vaari Paata

సినిమాకు స్టంట్ మాస్టర్స్ గా వర్క్ చేస్తున్న రామ్ లక్ష్మణ్
ఇటీవల సినిమాలోని ఫైట్స్ పై క్లారిటీ ఇచ్చారు. దుబాయ్ యాక్షన్ సీన్స్ అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయట. బిగ్ స్క్రీన్ పై చూసిన అభిమానులకు సరికొత్త కిక్కివ్వడం కాయమని అంటున్నారు. మరి సినిమా అభిమానులను అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ ఒక బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనుంది. మహేష్, కీర్తి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా చాలా క్యూట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన షూటింగ్ ఆలస్యం అయితే సమ్మర్ కు రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X