Mahesh Babu జీవితంలో ఇంతకంటే ఏం కావాలి ఎమోషనల్..బర్త్ డే రోజున మహేష్ స్పీచ్ వీడియో వైరల్..టీజర్ రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా జరుపుకొన్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా మహేష్ తన బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినా.. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఘనతలను సోషల్ మీడియాలో షేర్ చేసి మహేష్ ప్రేమానురాగాలను చాటుకొన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో వైరల్ అవుతున్నది. మహేష్ బర్త్ డే సందర్భంగా వైరల్ కావడానికి ఆ వీడియోలో ఏమున్నందంటే...

ఫ్యాన్స్ భారీగా ట్రెండింగ్
మహేష్ బర్త్ డేను పురస్కరించుకొని అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాల హ్యాష్ ట్యాగులతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ మొదలు పెట్టారు. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు నుంచి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. రకరకాల హ్యాష్ ట్యాగులను ట్రెండ్ చేసి హంగామా చేశారు.

టాలీవుడ్‌లో ఏ హీరోకు రానటువంటి
టాలీవుడ్‌లో ఏ హీరోకు రానటువంటి రికార్డు ట్రెండింగ్ లైక్స్, వ్యూస్, రీచ్ మహేష్‌కు వచ్చేలా ఫ్యాన్స్ అభిమానాన్ని చాటుకొన్నారు. రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకొని మిలియన్ల కొద్ది రీచ్‌ను ప్లాన్ చేశారు. పాత, కొత్త వీడియోలను ట్వీట్ చేస్తూ రికార్డు స్థాయిలో బర్త్ డే ట్రెండింగ్‌ను సృష్టించి హల్‌చల్ చేశారు.

#SSMB28 సినిమా అప్‌డేట్
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారీ పాట, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేశారు. అవి రిలీజైన కొద్ది సేపటికే రికార్డు స్థాయి లైక్స్ సాధించాయి. సర్కారు వారి పాట బ్లాస్టర్, #SSMB28 సినిమాల అప్‌డేట్స్ అభిమానులకు ఆనందాన్ని పంచాయి. సర్కారు వారీ పాట స్పెషల్ టీజర్‌కు సోషల్ మీడియా, యూట్యూబ్‌కు కలిపి రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్ వచ్చినట్టు సమాచారం.

Superstar Birthday Blaster మంచి స్పందన
మహేష్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన సర్కారు వారి పాట Superstar Birthday Blasterకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యథికమైన వ్యూస్ వచ్చిన వీడియోగా రికార్డు సృష్టించింది. 25.7 మిలియన్ల వ్యూస్, 750k లైక్స్ రావడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు. బర్త్ డే టీజర్లలో మహేష్ బాబు సరికొత్త రికార్డును నమోదు చేయడం విశేషంగా చెప్పుకొంటున్నారు.

మహేష్ కెరీర్, రియల్ లైఫ్‌ను చెప్పే
ఇలాంటి మహేష్ బాబు కోసం హారిక, హాసిని, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేసిన ఓ ప్రోమో వైరల్ అయింది. మహేష్ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలిపే ఓ వీడియోను రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ వీడియో మహేష్ బాబు ఎమోషనల్‌గా చెప్పిన మాటలు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి. తన గురించి డాక్టర్లు చెప్పిన విషయాలను ఇటీవల తన సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన మాటలు సూపర్ స్టార్ సామాజిక బాధ్యతను గుర్తు చేశాయి.

చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్‌తో
మహేష్ బాబు తన జీవితంలో వెండితెర మీదనే కాక వాస్తవ జీవితంలో రియల్ హీరో అనిపించుకొంటున్నారు. వేయి మందికి పైగా చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు, తన సొంత గ్రామంలో కరోనావైరస్ నివారించే వ్యాక్సిన్సు ఇప్పించడం తెలిసిందే. చిన్న పిల్లలకు సర్జరీ చేసేటప్పుడు నా పేరు చెబితే నవ్వుతారు. హ్యాపీగా ఉంటారు అని డాక్టర్లు చెప్పినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. జీవితంలో అంతకంటే ఏమీ కావాలి అని మహేష్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో, డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

మహేష్ బాబు కెరీర్ ఇలా..
ఇక మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును నిర్మాత నాగవంశీ ఎనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











