100 మిలియన్లు కొల్లగొట్టిన శ్రీమంతుడు మహేష్‌బాబు.. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎప్పుడు ఆపదలో ఉన్న ఆదుకొనే డైరెక్టర్ కొరటాల శివ. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. తాను ఎప్పుడు హిట్టు లేకుండా క్లిష్టపరిస్థితుల్లో ఉంటే కొరటాల శివ నాకు మంచి హిట్ అందించాడు అని చెప్పుకొంటారు. నిజంగా మహేష్‌కు ఓ మంచి హిట్టు కావాలనే సమయంలో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ప్రస్తుతం అలాంటి మూవీ ప్రస్తుతం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఆ రికార్డు ఏమిటంటే..

శ్రీమంతుడు అలా మొదలై..
దర్శకుడు సుకుమార్‌తో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం మహేష్‌బాబుకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత తనకు దూకుడు లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన శ్రీను వైట్లతో చేసిన ఆగడు సినిమా మరీ దారుణమైన ఫలితాన్ని అందించింది. అలాంటి సమయంలో కొరటాల శివ చెప్పిన కథ నచ్చడంతో శ్రీమంతుడు మొదలైంది.

మహేష్‌ను సక్సెస్ ట్రాక్‌పైకి
శ్రీమంతుడు సినిమా రిలీజ్ తర్వాత తొలి రెండు, మూడు రోజులు మిశ్రమ ఫలితాన్ని సాధించింది. ఆ తర్వాత సింగిల్ టాక్‌తో సక్సెస్ వైపు దూసుకెళ్లింది. ఆ తర్వాత రికార్డులను తిరిగి రాయడమే కాకుండా మళ్లీ మహేష్‌ను సక్సెస్ ట్రాక్‌పై నిలబెట్టింది. పలు వేదికలపై మహేష్ బాబు.. అటు శ్రీమంతుడు సినిమాను, కొరటాల శివను ప్రశంసించడం తెలిసిందే.

యూట్యూబ్‌లో 100 మిలియన్లు
అలా మహేష్ బాబు కెరీర్‌లో అత్యంత కీలకమైన చిత్రం శ్రీమంతుడు చిత్రం యూట్యూబ్‌లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన ఏకైక తెలుగు చిత్రంగా ఘనతను సాధించిందని టీమ్ మహేష్ బాబు ట్వీట్ చేసింది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా
ప్రస్తుతం శ్రీమంతుడు మూవీకి సంబంధించిన రికార్డు #Record100MForSRIMANTHUDU హ్యాష్‌ట్యాగ్‌తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నది. యూట్యూబ్‌లో అత్యంత ఫాస్టెస్ట్‌గా 100 మిలియన్స్ వ్యూస్ సాధించిందని, మిగితా సినిమాలతో పోల్చుకొంటే 24 మిలియన్ల వ్యూస్ తేడా ఉందని పేర్కొన్నారు.
Recommended Video

గీతా గోవిందం దర్శకుడితో
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాంతో మహేష్ బాబు చేతులు కలిపాడు. ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయింది. లేకపోతే ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడనున్నది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమా గురించి అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











