శాంటా వేషంలో ఉన్నది మహేష్ బాబే... పార్టీలో బాలయ్య కూతురు కూడా!
మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి తమ స్నేహితుల కుటుంబాలతో క్రిస్మస్ వేడుక ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోస్ నమ్రత ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా విడుదల చేశారు. అయితే ఇందులో ఓ ఫోటోలో మహేష్ బాబు గెటప్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మొదట అందులో ఉన్నది మహేష్ బాబు అవుదో కాదో ? అని కాస్త సందేహ పడ్డ ఫ్యాన్స్.... శాంటాక్లాజ్ వేషంలో ఉన్నది తమ సూపర్ స్టారే అని తెలిసి సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ ఫోటోస్ చూస్తుంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు హడావుడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహేష్ బాబును ఇలా చూడటం ఇదే తొలిసారి
క్రిస్మస్ వేడకలో మహేష్ బాబు శాంటాక్లాజ్ అవతారం ఎత్తారు. శాంటా అవతారంలో ఉన్న మహేష్‌తో దిగిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేవారు. సూపర్ స్టార్‌ను ఈ గెటప్‌లో చూడటం ఇదే తొలిసారి అంటున్నారు అభిమానులు.

క్రిస్మస్ శాంటాతో సితార ఆటలు
క్రిస్మస్ శాంటాతో సితార ఆటలు ఆడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడచ్చు. సెలబ్రిటీల ఇళ్లలో జరిగే వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి అనడానికి ఈ ఫోటోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

బాలయ్య కూతురు బ్రాహ్మణి
ఈ క్రిస్మస్ పార్టీలో బాలయ్య కూతురు నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. నమ్రత షేర్ చేసిన ఫోటోలో బ్రాహ్మణి కూడా కనిపించడం గమనార్హం.

నమ్రత గర్ల్ గ్యాంగ్
సెల్రబిటీ సర్కిల్‌లో నమ్రత తనకంటూ ఒక గర్ల్ గ్యాంగ్‌ను తయారు చేసుకున్నారు. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడల్లా అందరూ ఒక చోట చేరి చిల్ అవ్వడం ఈ గ్యాంగ్ స్టైల్. అందులో నమ్రతతో పాటు ఉపాసన మెయిన్ మెంబర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

మారుతున్న పరిణామాలు
ఈ మధ్య కాలంలో తెలుగులు సినిమా పరిశ్రమలో పరిణామాలు మారిపోతున్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తరచూ పార్టీల్లో కలుస్తూ ఇటు అభిమానుల్లోకి పాజిటివ్ వైబ్స్ పంపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











