SVP: విలన్స్ ను కొట్టడానికి బెల్ట్ తీస్తున్న మహేష్ బాబు.. పండగ రోజు అదిరిపోయే స్టిల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇక దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నాడు. అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక చిత్ర యూనిట్ ఉగాది పండుగ సందర్భంగా ఒక మాస్ పోస్టర్ను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్

డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్

గీత గోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న పరుశురామ్ అనుకోకుండా మహేష్ బాబు నుంచి పిలుపు అందుకొని సర్కారు వారి పాట కథను చెప్పాడు. ఒక్కరోజులోనే మహేష్ బాబుకు ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆలస్యం చేయకుండా డేట్స్ ఇచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమా పూర్తయ్యే వరకు మరొక సినిమాను మొదలు పెట్టాను అని మాట కూడా ఇచ్చాడు. దీంతో దర్శకుడు స్వేచ్ఛగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ ను డిఫరెంట్ గా సినిమాలో హైలెట్ చేశాడట.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను పలుమార్లు వాయిదా వేశారు. దీంతో రిలీజ్ డేట్స్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. అసలైతే ఈ ఏడాది సంక్రాంతికి సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మిగతా సినిమాల నుంచి పోటీ ఉండడం అలాగే కరోనా కారణంగా కూడా వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ఫైనల్ గా మే 12వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా అనుకున్న సమయానికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

బడ్జెట్.. అనుకున్న దానికంటే ఎక్కువే..

బడ్జెట్.. అనుకున్న దానికంటే ఎక్కువే..

ఈ సినిమాలో బ్యూటీఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి మహేష్ బాబు కీర్తి సురేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు అయితే మొదటి నుంచే మూవీపై అంచనాలు అమాంతంగా పెరిగి పోతున్నాయి. ఇక ఈ సినిమా కోసం బడ్జెట్ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే అయినట్లు తెలుస్తోంది.

బెల్ట్ తీస్తున్న మహేష్

బెల్ట్ తీస్తున్న మహేష్

ఇక నేడు సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదలచేశారు. ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో మహేష్ బాబు విలన్స్ ను కొట్టడానికి తన ప్యాంట్ కు ఉన్న బెల్ట్ ను తీస్తూ ఉండడం విశేషం. చూస్తుంటే ఊర మాస్ ఫైట్స్ తో అభిమానులకు మహేష్ మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాడు అనిపిస్తోంది.

 మరో రెండు సాంగ్స్..

మరో రెండు సాంగ్స్..

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తమన్ స్వరపరిచిన పాటలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సర్కారు వారి పాటలోని కళావతి పాట అలాగే పెన్నీ సాంగ్ కూడా సక్సెస్ అయ్యాయి. మరో రెండు పాటలను కూడా సినిమా విడుదల అయ్యే లోపు విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X