Just In
- 23 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 10 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 10 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
- 11 hrs ago
బైక్ పై స్టార్ హీరో వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss!
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Sports
రోహిత్ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?
- News
గర్జించబోతున్న కేసీఆర్... 'కమ్ బ్యాక్' కోసం భారీ బహిరంగ సభ... ఈసారి తిరుగులేని వ్యూహంతో?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్.. మహేష్ జెట్ స్పీడ్ టార్గెట్.. మొదలుపెడితే ఆగదట!
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్న మహేష్ ఎలాగైనా సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అయితే సినిమాను ఎనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇంకా షూటింగ్ అయితే మొదలు కాలేదు. కానీ ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకొని షూటింగ్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా దెబ్బ కొట్టడంతో..
మహేష్ బాబు చాలా వరకు ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు అంటే వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. కానీ లాక్ డౌన్ కాలంలో కుదరకపోవడం వలన దాదాపు ఏడాది పాటు షూటింగ్ లేకుండా గడపాల్సి వచ్చింది. అసలైతే సర్కారు వారి పాటను ఈ ఏడాది మొదట్లోనే మొదలు పెట్టి ఉంటే ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ.. కరోనా ఒక్కసారిగా దెబ్బ కొట్టడంతో ప్లాన్స్ చేంజ్ అయ్యాయి.

స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్లనే..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మొత్తానికి మహేష్ మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తరువాత వెంటనే వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్లనే రిజెక్ట్ చేసినట్లు టాక్.

రెండు నెలల క్రితమే మొదలు పెట్టాలని..
ఇక గీత గోవిందం ఫేమ్ పరశురామ్ చెప్పిన సర్కారు వారి పాట స్క్రిప్ట్ ను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన మహేష్ వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. ఇక రెండు నెలల క్రితమే మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ కరోనా కారణంగా ఆలస్యం చేయాల్సి వచ్చింది. సెట్ చేసుకున్న షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి.

మొదలుపెడితే ఆగదట!
ఇక ఫైనల్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జనవరిలో మొదలు పెట్టాలని దర్శకుడు ప్లాన్ సెట్ చేసుకోగా.. మహేష్ బాబు ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో జాయిన్ కావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. మొదలు పెడితే ఏ మాత్రం బ్రేక్ పడవద్దని ఇప్పటికే నిర్మాత కూడా షెడ్యూల్స్ ని సెట్ చేయించిన్నట్లు టాక్.

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
ఇక ఫైనల్ గా సినిమాను ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాలని డిసైస్ అయ్యారట. అంటే షూటింగ్ ను జనవరిలో మొదలు పెడితే జెట్ స్పీడ్ లో ఐదారు నెలల్లో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మహేష్ కూడా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అనుకున్నట్లుగా ఆగస్ట్ లో సినిమాను పూర్తి చేస్తే రాజమౌళి సినిమా కోసమైనా రెడీ కావచ్చని లేదా మరో చిన్న సినిమా అయినా చేసుకోవచ్చని మాహేష్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.