twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్కారు వారి పాట’ కోసం మహేశ్ రిస్క్: ఆగేదే లేదు అనేలా దూసుకెళ్తాడట

    |

    కొంత కాలంగా వరుస హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ గత జనవరిలో విజయవంతంగా పూర్తైంది. ఆ వెంటనే సెకెండ్ షెడ్యూల్ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ, అంతలో కరోనా రెండో దశ విజృంభించడంతో అది సాధ్యం కాలేదు. ఇక, ఈ మూవీ షూటింగ్ గురించి తాజాగా ఓ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది.

    'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్‌ను జూన్ చివరి వారంలో గానీ, జూలై మొదటి వారంలో గానీ ప్రారంభిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీన్ని జూలై ఫస్ట్ వీక్‌లోనే ప్రారంభించబోతున్నారట. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తుందట. ఇక్కడ షెడ్యూల్ పూర్తైన వెంటనే అమెరికాలో కానీ, దుబాయ్‌లో కానీ చిత్రీకరణ జరపనున్నారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ మహేశ్ బాబు గ్యాప్ తీసుకోడని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Starts From July

    భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'ను బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. జయరాం మహేశ్ బాబు తండ్రిగా చేస్తున్నారు. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

    English summary
    Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Shooting Starts From July First Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X