‘సర్కారు వారి పాట’ కోసం మహేశ్ జాగ్రత్తలు: ప్రస్తుతానికి అలా ఫిక్సైన సూపర్ స్టార్

టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. పరశురాం తెరకెక్కిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కమర్షియల్ పంథాలో సందేశాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు. అయితే, ఆ వెంటనే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఇక, ఈ జనవరిలో మొదటి షెడ్యూల్ జరిగినా.. సెకెండ్ వేవ్ కారణంగా రెండోది వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఈ చిత్ర షూటింగ్‌ను పున: ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంల దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

'సర్కారు వారి పాట' షూటింగ్‌ను దీన్ని జూలై ఫస్ట్ వీక్‌లోనే ప్రారంభించబోతున్నారట. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తుందట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు ఆదేశాల ప్రకారం హైదరాబాద్‌లో జరగనున్న షెడ్యూల్‌లో చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణ జరపనున్నారట. అంతేకాదు, ఇందులో ఎక్కువగా సోలో సీన్స్ మాత్రమే షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే, కోవిడ్ కోసం ఎన్నో జాగ్రత్తలు కూడా పాటించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 Mahesh Babu Sarkaru Vaari Paata Shooting with Limited Actors

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు తొలిసారి పూర్తి స్థాయి రఫ్ లుక్‌తో కనిపించబోతున్నాడు. బ్యాంకులను మోసం చేస్తున్న బడా బాబులను టార్గెట్ చేస్తూ ఈ చిత్ర్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X