For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంక్రాంతి రేసు నుంచి వెనక్కు తగ్గిన మహేష్ బాబు.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

  |

  సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ సినిమా వాయిదా పడింది. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు మహేష్ బాబు. ఆ వివరాల్లోకి వెళితే

  అన్నీ ఒకేసారి పడడంతో

  అన్నీ ఒకేసారి పడడంతో

  టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల రిలీజ్ డేట్ల టెన్షన్ నెలకొంది అని చెప్పక తప్పదు. ఒక రకంగా ఇదే రకమైన పరిస్థితి ఫస్ట్ వేవ్ పూర్తయిన తర్వాత కనిపించింది. కరోనా మొదటి వేవ్ పూర్తయిన తర్వాత ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని సినిమాలు చేస్తున్నారో అన్ని సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్ లను ఒక్కసారిగా ప్రకటించారు. అయితే ఆ సినిమాలు పూర్తి స్థాయిలో రిలీజ్ కాకుండానే కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించడంతో సెకండ్ వేవ్ రావడం మళ్ళీ థియేటర్లు మూత పడ్డాయి.

  రిలీజ్ డేట్ల టెన్షన్

  రిలీజ్ డేట్ల టెన్షన్

  ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ డేట్ల ప్రకటనలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కుతున్న అన్ని సినిమాలు ఇప్పుడు దాదాపు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సంక్రాంతికి వస్తున్నా సినిమాలను వెనక్కు వెళ్ళమని కోరాడని, అందులో రాధే శ్యామ్ సినిమాతో వస్తున్నా ప్రభాస్ ఒప్పుకోలేదని, పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని, కానీ మహేష్ బాబు ఒప్పుకుని వెనక్కు వెళ్ళడానికి సిద్ధమయ్యాడని గతంలో ప్రచారం జరిగింది.

  అయితే జనవరి 7న రాజమౌళి సినిమా ప్రకటన చేయడంతో ఎప్పుడో 13న రావాల్సిన సినిమా ఇంకా వెనక్కు వెళ్లే అవకాశం లేదని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మహేష్ బాబు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి షాక్ ఇచ్చారు.

  బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో

  బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో

  సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలు కాకముందే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ సినిమాలో మహేష్ ప్రీ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.

  మహేష్ మెడ మీద రూపాయి గుర్తుతో ఉన్న టాటూ, మహేష్ జూలపాల లుక్ సినిమా మీద ఆసక్తి పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ తర్వాత సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ చాలా తక్కువే కానీ వచ్చిన అన్నీ సినిమా మీద ఆసక్తిని పెంచాయి.

  షూటింగ్ లు పూర్తికాక

  షూటింగ్ లు పూర్తికాక

  మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారతదేశంలో జరిగిన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కు సంబంధించిన కథ నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మహేష్ తో కీర్తి సురేష్ కలిసి నటిస్తోంది.. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న మలయాళ నటుడు జయరామ్ మహేష్ బాబు తండ్రి గా నటిస్తున్నట్టు సమాచారం.

  మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా షూటింగ్ లు క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను వాయిదా వేశారు.

  2022 ఏప్రిల్ 1న

  2022 ఏప్రిల్ 1న

  ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు మహేష్ బాబు అధికారికంగా ప్రకటించారు. హ్యాపీ దీపావళి అని ఒక పోస్ట్ చేసిన ఆయన ఏప్రిల్ ఒకటి 2022 తేదీన వస్తున్నామని ప్రకటించారు. ఇక ఆయన షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు మెడ మీద రూపాయి కాయిన్ గుర్తుతో కనిపిస్తుండగా, చెవికి పోగుతో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు ఈ తేదీ ప్రకటించాడని ముందు అభిమానులు బాధపడ్డా ఆ తర్వాత మహేష్ బాబు అలాగే టీం ప్లానింగ్ చూసి భీభత్సమైన నమ్మకం తెచ్చుకున్నారు.

  ప్లానింగ్ మామూలుగా లేదుగా

  ప్లానింగ్ మామూలుగా లేదుగా

  ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ శుక్రవారం కాగా ఆ తర్వాతి రోజు అంటే శనివారం నాడు ఉగాది పండుగ వస్తుంది. అలాగే ఆదివారం నాడు ఎలాగూ సెలవు ఉంటుంది, ఇక నాలుగో తేదీ వదిలేస్తే ఐదో తేదీన మరోసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే అమెరికా విషయానికి వస్తే ఒక రోజు ముందే ప్రిమియర్స్ పడతాయి కాబట్టి ఆ రోజు గురువారం సినీ హాలిడే అని చెప్పవచ్చు.

  అలాగే మూడు రోజులు కూడా వరుసగా లాంగ్ వీకెండ్ రావడంతో అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.నష్టంలో లాభం అన్నట్లుగా ఒకపక్క సినిమా వాయిదా పడిందని బాధపడుతూనే మరోపక్క ఈ విధంగా కలిసి రానుందని ఆనంద పడుతున్నారు అభిమానులు.

  మరి మహేష్ బాబు అలాగే సినిమా టీమ్ ఈ ఆలోచన ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితం స్పెయిన్లో జరిగింది..స్పెయిన్ లో షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ అంతా మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంది.

  English summary
  Mahesh starrer Sarkaru Vaari Paata skips sankranthi release and to release on april 1st 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X