Mahesh Babu సంచలన నిర్ణయం: ఇండియా మొత్తం గుర్తించేలా రిస్క్.. వాళ్ల కంటే 30 కోట్ల ఖర్చు

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు ప్రిన్స్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి అవార్డుల మీద అవార్డులు దక్కించుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్న ఈ స్టార్ హీరో.. వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అది కూడా సొంతం రిస్క్‌తో. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

హ్యాట్రిక్ కొట్టాడు... సత్తా చాటాడు

హ్యాట్రిక్ కొట్టాడు... సత్తా చాటాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి', అనిల్ రావిపూడి తీసిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సర్కారు వారి పాట అంటున్నాడు

సర్కారు వారి పాట అంటున్నాడు

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ

ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ

బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తీసే చిత్రమే 'సర్కారు వారి పాట'. ఇందులో హీరో తండ్రి బ్యాంక్ మేనేజర్ కాగా.. అతడిని ఓ బిజినెస్‌మ్యాన్ మోసం చేస్తాడట. దీంతో ఆయనకు చెడ్డ పేరు వస్తుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తన తండ్రి పరువును కాపాడడంతో పాటు ఆ వ్యాపారవేత్తను పట్టించేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అట.

షూటింగ్ అప్‌డేట్ ఇదే.. ఇంకెంత?

షూటింగ్ అప్‌డేట్ ఇదే.. ఇంకెంత?

'సర్కారు వారి పాట' మూవీ ప్రకటన ఎప్పుడో వెలువడింది. కానీ, పూజా కార్యక్రమాలు గత లాక్‌డౌన్ సమయంలో జరిగాయి. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ గత జనవరిలో ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే దుబాయ్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇంకా.. 70 శాతం షూటింగ్ జరగాల్సి ఉందని టాక్.

పట్టాలపై ఉండగానే రికార్డు స్థాయి

పట్టాలపై ఉండగానే రికార్డు స్థాయి

తెలుగులో మహేశ్ బాబు నటించే సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే 'సర్కారు వారి పాట' మూవీకి అప్పుడే భారీ డీల్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఏరియాలను బట్టి కొన్ని డీల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్లు. ఇందులో భాగంగానే నైజాం హక్కులకు రూ. 40 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట.

మహేశ్ బాబు సంచలన నిర్ణయం

మహేశ్ బాబు సంచలన నిర్ణయం

'సర్కారు వారి పాట' యూనివర్శల్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారని ఆరంభంలో ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత అదంతా ఉత్తదే అని పలువురు క్లారిటీ ఇచ్చారు. కానీ, యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి సంకేతాలు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇండియా మొత్తం గుర్తించేలా రిస్క్

ఇండియా మొత్తం గుర్తించేలా రిస్క్

'సర్కారు వారి పాట'కు మహేశ్ బాబు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు అతడే స్వయంగా ఖర్చ పెట్టబోతున్నాడట. ఇందుకోసం మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కంటే అదనంగా రూ. 20-30 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడని తెలిసింది. ఈ ప్రకటన త్వరలోనే రాబోతుందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X