ఇండియా-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్‌లో సందడి చేసిన మహేష్ బాబు!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. వీరితో పాటు 'మహర్షి' మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా జాయిన్ అయ్యారు.
'మహర్షి' మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో హ్యాపీ మూడ్లో ఉన్న మహేష్ మే చివరి వారంలో యూరఫ్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు ఆదివారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలను సూపర్ స్టార్ సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేశారు. మ్యాచ్ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చింది అంటూ ట్వీట్ చేశారు.

ఇండియా వచ్చిన వెంటనే మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో జాయిన్ కాబోతున్నారు. మహేష్ కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆర్మీ ఆఫీసర్‌గా, మిలటరీలో పని చేసే తన స్నేహితుడి కుటుంబానికి సహాయం చేసే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని, అనిల్ రావిపూడి సినిమాల తరహాలో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్. లీకైనట్లుగా చెబుతున్న కథ ప్రకారం... ఈ చిత్రంలో మహేష్ బాబు ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతోందట. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని, నిర్మాత బండ్ల గణేష్ఒక ఫన్నీలో నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రష్మిక మందన్న మహేష్ బాబుకు ప్రియురాలి పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తోందట.


Click it and Unblock the Notifications











