మా జీవితాల్లో ఒక వెలుగులా విరాజిల్లు: మహేష్ భావోద్వేగం

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఫ్ కోర్స్ మహేష్ బాబే కాదు, ఏ వ్యక్తి అయినా తమ కుటుంబంపై, పిల్లలపై మమకారం, ప్రేమ కలిగి ఉంటారు. అయితే మహేష్ బాబు ఆ ప్రేమను వ్యక్తి పరిచే విధానం భిన్నంగా ఉంటుంది.

మహేష్ తనయుడు గౌతమ్ ఆగస్టు 31తో టీజనేజ్(13)లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ తన కుమారుడిని విష్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. తాజాగా ఆదివారం మహేష్ బాబు మరో ట్వీట్ చేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు.

Mahesh Babu shared Gautam best picture ever

"ఇది ఎప్పటికీ బెస్ట్ పిక్చర్... ఎందుకంటే నువ్వు ఇపుడు టీనేజ్‌లోకి అడుగు పెట్టావు. సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. మా జీవితాల్లో ఓ వెలుగులా విరాజిల్లు... లవ్ యూ మై బాయ్ గౌతమ్" అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X