గౌతమ్ ట్రెండీ లుక్‌ను షేర్ చేసిన మహేష్.. తండ్రికి తగ్గట్టుగానే.. స్టన్నింగ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని పై కూడా ఫ్యాన్స్ ఫోకస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా అతను కూడా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ముందుగానే ఒక క్లారిటీ వచ్చేసింది. వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ అద్భుతంగా కనిపించాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ కాలేజ్ దశలోకి వచ్చేసాడు. ఇక అతనికి సంబంధించిన ఫోటోలను చాలా రోజుల తర్వాత మహేష్ షేర్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ మ్యాన్

ఫ్యామిలీ మ్యాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత దగ్గరగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా షూటింగ్ లేదంటే ఫ్యామిలీ తప్ప మిగతా ఏ విషయాల పై కూడా మహేష్ పెద్దగా ఆలోచించడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో అతనికి స్నేహితులు కూడా చాలా తక్కువ ముందే ఉన్నారు. మహేష్ ఎక్కువగా తన కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు.

ఫ్యామిలీ వెకేషన్స్

ఫ్యామిలీ వెకేషన్స్

సినిమా షూటింగ్స్ కు ముందు అలాగే సినిమా షూటింగ్స్ తరువాత వీలైనన్ని ఎక్కువసార్లు ప్రత్యేకంగా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కు వెళుతూ ఉంటాడు. విదేశాలకు వెళితే మాత్రం అందరూ కలిసే వెళతారు. మహేష్ బాబు తన కొడుకు కూతురితో తరచుగా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక వారికి తోడుగా సతీమణి నమ్రత కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.

 గౌతమ్ లేటెస్ట్ లుక్

గౌతమ్ లేటెస్ట్ లుక్

అయితే గౌతమ్ ఘట్టమనేని లేటెస్ట్ ఫోటోను చూసి మాత్రం చాలా రోజులు అయింది. అతను తన స్కూలింగ్ దశను ముగించుకొని ప్రస్తుతం కాలేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం గౌతమ్ వయసు 15 సంవత్సరాలు. కానీ ఒక యువ హీరో తరహాలోనే కనిపిస్తూ ఉన్నాడు. హైట్ కూడా బాగానే పెరిగాడు. కాబట్టి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా ఎంత సమయం లేదు అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

వెండితెరపై హీరోగా

వెండితెరపై హీరోగా

గౌతమ్ ఘట్టమనేని కూడా వెండితెరపై హీరోగా కనిపించాలి అనే అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే అతన్ని మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాలో చూపించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో కనిపించిన గౌతమ్ చాలా చక్కగా నటించాడు. మొదటి సినిమాకే అతనికి మంచి గుర్తింపు లభించింది.

Recommended Video

లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
 మరో మహేష్ బాబులా..

మరో మహేష్ బాబులా..

అయితే గౌతమ్ ఘట్టమనేని సంబంధించిన లేటెస్ట్ ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తుచేస్తూ గౌతమ్ అలాగే సితార ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఇక ఫోటోలు నిమిషాల్లోనే ట్రెండింగ్ లిస్టులో చేరిపోయాయి. గౌతమ్ లుక్స్ కూడా పూర్తిగా మారిపోయాయి. అతను నవ్వుతూ ఉంటే ఒక నిమిషం వరకు మహేష్ బాబు అనే అనుమానం రాకుండా ఉండదు. చూస్తూ ఉంటే వెండితెరపైకి వచ్చేసరికి అతను మరో మహేష్ బాబు లాగా కనిపిస్తాడు అని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X