Mahesh Babu Remuneration: గుంటూరు కారం మూవీకి భారీ రెమ్యునరేషన్.. మహేష్ బాబు పారితోషికం ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన చిన్నప్పుడే చిచ్చర పిడుగులా నటించాడు. హీరోగా మారిన తర్వాత నుంచి అయితే ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. సినిమా సినిమాకు తన టాలెంట్ ను మరింత పెంచుకుంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా 1999లో రాజకుమారుడు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు 28 సినిమాల్లో నటించి మెప్పించాడు. అనేక హిట్లు కొట్టాడు. తాజాగా 28వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

2024 సంక్రాంతి పండుగ సందర్భంగా SSMB 28చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అతడు, ఖలేజా వంటి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రిపీట్ కాంబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితోనే చిత్రబృందం కూడా సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుందట.

 Mahesh Babu Shocking Remuneration For Guntur Kaaram Movie Check Details

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించబోతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ వంటి స్టార్ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో మాస్ పర్ఫార్మెన్స్ చూపించేందుకు మహేష్ బాబు ఎంత ఛార్జ్ చేశారో తెలుసా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకు గాను మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో తన క్యారెక్టర్ కు తగ్గట్లుగా 60 కోట్ల రూపాయల నుంచి 80 కోట్లు వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే.

అయితే గుంటూరు కారంలో తాను సూపర్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. ముఖ్యగా మిల్క్ బాయ్ ఇమేజ్ ఉన్న ఈయన ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. లుంగీ కట్టుకుని, బీడీ తాగుతూ రచ్చ చేయనున్నారు. ఇలాంటి నటనకు గాను ఈయన బాగానే చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. జీఎస్టీ కాకుండానే 78 కోట్ల పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. జీఎస్టీని వాళ్లే కట్టుకుని.. పూర్తి 78 కోట్లను మహేష్ బాబుకు ఇస్తారు.

 Mahesh Babu Shocking Remuneration For Guntur Kaaram Movie Check Details

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X