Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
రెమ్యూనరేషన్లో మహేష్ బాబుకు ‘సరిలేరు’.. మొత్తంగా ఎంత తీసుకున్నాడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి వరుస హిట్లతో ఉన్న సూపర్ స్టార్.. హ్యాట్రిక్‌పై కన్నెశాడు. అనిల్ రావిపూడి లాంటి మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్‌తో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్లతో హంగామా చేస్తుండగా.. ఈ మధ్య విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి మహేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
ఎన్నో ప్రత్యేకతలతో..
మహేష్ బాబు 26వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాను ఎన్నో ప్రత్యేకమైన హంగులతో తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. ఎన్నో యేళ్ల తరువాత లేడీ సూపర్ ప్టార్ విజయశాంతి మళ్లీ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. అంతేకాకుండా బడా ప్రొడ్యూసర్‌గా మారిన కమెడియన్ బండ్ల గణేష్ మరో కీలక పాత్రను పోషిస్తున్నాడు.
మహేష్ మ్యానరిజం హైలెట్ ..
ఖలేజా, దూకుడు లాంటి చిత్రాల్లో మహేష్ మ్యానరిజం ఎంతగా హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రాల్లో సరికొత్త మహేష్ బాబును చూశారు ఫ్యాన్స్. మళ్లీ ఓ డిఫరెంట్ స్టైల్, మాడ్యులేషన్‌తో రాబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్లో మహేష్ మ్యానరిజం ఎలా ఉండబోతోందన్న విషయం హింట్ ఇచ్చాడు.
బిజినెస్ క్లోజ్..
తాజాగా అందిన సమాచారం మేరకు అని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్‌కు భారీ స్పందన వచ్చిందని, మంచి ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో కలిపి 101. 25 కోట్ల రూపాయలకు ఈ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
షాకింగ్ రెమ్యూనరేషన్..
రెమ్యూనరేషన్ కింద శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈమధ్యే శాటిలైట్.. డిజిటల్.. హిందీ డబ్బింగ్ హక్కులకు సంబంధించిన డీల్స్ క్లోజ్ అయ్యాయని సమాచారం. సన్ టీవీ వారు శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్ ను జాయింట్ గా రూ.30 కోట్లకు తీసుకున్నారట. హిందీ డబ్బింగ్ హక్కుల డీల్ రూ. 15 కోట్లకు ఫైనలైజ్ అయిందట. ఇతర రైట్స్ విలువ మరో కోటి వరకూ ఉందట. అంటే ఈ రైట్స్ అన్నిటిని కలిపితే 46-47 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. జీఎస్టీ ను మినహాయించుకుంటే మహేష్ దాదాపు 41 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని సమాచారం. మహేష్ బాబు కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని టాక్.