For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ ను మహేష్ అంత ఈజీగా మర్చిపోడు.. ఈసారి కూడా స్పెషల్ విషెస్!

  |

  సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల స్నేహంగా ఉంటే అభిమానులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనేది అందరి ఆలోచన. అందుకే నేటితరం అగ్ర హీరోలు కూడా అదే తరహాలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే రెగ్యులర్ గా కలుసుకున్న కూడా ఆ విషయాలను పెద్దగా బయటకు చెప్పుకోరు. ఇక కొందరు మాత్రమే పబ్లిక్ లో కూడా ఫ్రీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మిగతా అందరి హీరోలతో స్నేహంగా ఉండే అతి కొద్ది మంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు.

  ఇండస్ట్రీలోకి కొత్త తరం యువ హీరోలు వచ్చినా కూడా మహేష్ బాబు తన మద్దతు ఇస్తూ ఉంటాడు. రీసెంట్ గా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన మంచితనం ఏమిటో నిరూపించుకున్నారు. గత ఏడాది కూడా మహేష్ బాబు స్పెషల్ గా విషెస్ స్పందించిన విషయం తెలిసిందే.

  RX 100 Karthikeya కాబోయే భార్య ఎంత అందంగా ఉందొ చూశారా? హీరోయిన్స్ చాలరు!

  స్టార్ హీరోల నుంచి స్పెషల్ విషెస్

  స్టార్ హీరోల నుంచి స్పెషల్ విషెస్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ స్పెషల్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రవితేజ, వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా మెగా ఫ్యామిలీ తో పాటు మిగతా హీరోలు కూడా పవర్ స్టార్ కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ ను అందిస్తున్నారు. దర్శకులు సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్ ద్వారా పవర్ స్టార్ ఫోటోలులను షేర్ చేస్తున్నారు.

  మెగా అభిమాని పెళ్లికి అల్లు అర్జున్.. వివాహ వేడుకలో సాయిధరమ్ తేజ్, ఇంకా సినీ ప్రముఖులు ఎవరంటే!

  అప్పటి నుంచి మంచి స్నేహితులుగా..

  అప్పటి నుంచి మంచి స్నేహితులుగా..

  ఇక ఫైనల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. వీరి ఇద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బయట ప్రపంచంలో ఎక్కువగా కలుసుకోపోయినప్పటికీ ఒకప్పుడు ఇండస్ట్రీలో పలు సమస్యలపై కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా అర్జున్ సినిమా విడుదల సమయంలో పైరసీపై పోరాటం చేసినప్పుడు మహేష్ బాబుని మొదట కలిసిన మొదటి హీరో పవన్ కళ్యాణ్. అందుకే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహం ఏర్పడింది.

  మహేష్ స్పెషల్ విషెస్

  మహేష్ స్పెషల్ విషెస్

  పవన్ కళ్యాణ్ నిజాయితీ ఏమిటో కొంతమంది స్టార్ హీరోలకు బాగా తెలుసు. అందుకే వారు ఏ స్థాయికి ఎదిగినా కూడా పవన్ కళ్యాణ్ పై స్పందిస్తూనే ఉంటారు. గత ఏడాది పవర్ స్టార్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఉదయం నుంచి మరోసారి మహేష్ బాబు విష్ చేస్తాడా లేదా అని చాలా సేపు ఎదురు చూశారు. ఫైనల్ గా పవర్ స్టార్ కు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్ ను అందించారు. హ్యాపీ బిర్త్ డే పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశాడు. నిజంగా మీకు ఈ సంవత్సరం మంచి జరగాలని.. ఎల్లప్పుడూ గొప్ప ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. అని మహేష్ బాబు వివరణ ఇచ్చారు.

  Prabhas Special Interview With Sridevi Soda Center Team
  నిజంగా సినిమా వస్తే..

  నిజంగా సినిమా వస్తే..

  ఇక మరోసారి చేసిన ఈ ట్వీట్ కూడా భారీ స్థాయిలో వైరల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ట్యాగ్ ఇంటర్నెట్ వరల్డ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేయడంతో ఆ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వీరి కలయికలో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నిజంగా సినిమా వస్తే బాక్సాఫీస్ రికార్డులు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఓ వర్గం అభిమానులు అయితే అది నిజమైతే బాగుంటదని కోరుకుంటున్నారు.

  English summary
  Mahesh babu special birthday wishes to Pawan kalyan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X