రాజమౌళి సినిమా కోసం మహేష్ అడ్వాన్స్ ప్లాన్.. త్రివిక్రమ్ సహకారంతోనే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నా మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేసిన వెంటనే మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో మరొక బిగ్ బడ్జెట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ తరుణంలో రాజమౌళి సినిమా కోసం ఇటీవల మహేష్ బాబు త్రివిక్రమ్ సహకారంతోనే ఒక ప్రత్యేకమైన ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసిన కూడా చాలా తొందరగా ఫినిష్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. దర్శకుడికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటే తన క్యారెక్టర్ కు కూడా పూర్తి న్యాయం అయితే చేస్తాడు. ఒక్కసారి షూటింగ్ మొదలు పెడితే జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయగల పెద్ద స్టార్ హీరోలలో మహేష్ బాబు ముందు ఉంటాడు అని చెప్పవచ్చు. అవసరమైతే సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కువ టైం కేటాయిస్తాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం కూడా సమయాన్ని లెక్క చేయకుండా మహేష్ హార్డ్ వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక 2023 సమ్మర్ కు సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే 2023 జనవరిలో రాజమౌళి సినిమా మొదలు అయ్యే అవకాశం ఉందట. ఈ క్రమంలో మహేష్ బాబు శ్రీనివాస్ సినిమాను ఈ ఏడాది చివరిలోపు ఎలాగైనా ఫినిష్ చేయాలి అని ఒక ప్రత్యేకమైన ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది.
ముందుగా చాలా కఠినమైన సన్నివేశాలు పూర్తి చేయాలని త్రివిక్రమ్ తో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేసినట్లు సమాచారం. అందుకే మొదటి షెడ్యూల్లో కూడా ఒక భారీ యాక్షన్స్ సన్నివేశాలను పూర్తి చేయబోతున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో మాత్రం పెద్ద సన్నివేశాలు ఏమీ ఉండకుండా కేవలం డైలాగ్ కు సంబంధించిన ఫ్యామిలీ సీన్స్ మాత్రమే ఉండేలా ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేయగానే రాజమౌళి సినిమా కోసం మహేష్ ఫిట్నెస్ లో కూడా కొంత మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్ తొందరగానే ఫినిష్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత మహేష్ లుక్ విషయంలో కూడా రాజమౌళి చర్చలు జరపనున్నాడు. మరి వారి కలయిక వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











