మహేష్ బాబు 'మహర్షి' టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహర్షి మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది.

మహర్షి టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది. తాజాగా మహర్షి చిత్ర యూనిట్ టీజర్ విడుదుల తేదీ, సమయాన్ని ప్రకటించింది. ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ఉదయం 9:09 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్ మీడియాలో స్పందిస్తూ ఏప్రిల్ 6న రిషి జర్నీలో అందరూ భాగం కావాలని కోరాడు.

Mahesh Babu starrer Maharshi teaser release date fix

స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా, రైతు సమస్యలని పరిష్కరించే వ్యక్తిగా మహేష్ బాబు పాత్ర మూడు కోణాల్లో ఉండబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X