ఏం మాట్లాడుతున్నారు మీరు? మీడియా ప్రతినిధులకు చుక్కలు చూపించిన మహేష్ బాబు!

మహేష్ బాబుతో కలిసి పని చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఆయన బయటకు కనిపించేంత సైలెంట్ పర్సన్ ఏమీ కాదని, స్మార్ట్‌గా సెటైర్లు వేయడంలో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరు అని చెబుతుంటారు. ఇటీవల డెన్వర్ పెర్ఫ్యూమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన మహేష్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మీడియా వారికి చుక్కలు చూపించారు.

డెన్వర్ బ్రాండ్ నన్ను ఎంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. వీరితో ఎక్కువ కాలం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. మగాళ్లకు గ్రూమింగ్ విషయంలో చాలా ముఖ్యమైనది పెర్ఫ్యూమ్, ఈ బ్రాండ్ ప్రచారానికి తాను ముందుకు రావడానికి అది కూడా ఓ కారణమని తెలిపారు.

నా పర్సనాలిటీ రిప్లెక్ట్ చేసే విధంగా ఉండాలి

నా పర్సనాలిటీ రిప్లెక్ట్ చేసే విధంగా ఉండాలి

నేను ఏ బ్రాండ్ ఎంచుకున్నా నా పర్సనాలిటీని రిప్లెక్ట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటాను. నా వద్ద చాలా పెర్ఫ్యూమ్ కలెక్షన్ ఉంది. ఇపుడు నా ఫేవరెట్ డెన్వర్ అని మహేష్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

దాని గురించి ఇప్పుడొద్దు, తర్వాత మాట్లాడుకుందాం

దాని గురించి ఇప్పుడొద్దు, తర్వాత మాట్లాడుకుందాం

మహర్షి సినిమా ఎంత వరకు వచ్చింది? దాని గురించి ఏమైనా చెప్పండి... అనే ఓ రిపోర్టర్ ప్రశ్నించగా మహేష్ బాబు రియాక్ట్ అవుతూ దానికి తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. ఇపుడు మాట్లాడే సందర్భం కాదు, ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది అంటూ అలాంటి ప్రశ్నలు ఇక ఎవరూ వేయకుండా చేశారు సూపర్ స్టార్.

నేను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు

నేను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు

మీకు నచ్చే పర్సనల్ బ్రాండ్లను మీ సినిమాలతో కనెక్ట్ చేయడం కానీ, అసోసియేట్ చేయడం కానీ చేశారా?... అనే ప్రశ్నకు ‘అలా ఎప్పుడూ చేయలేదు. అదంతా క్రియేటివ్ టీమ్ చూసుకుంటుంది. నేను ఫోర్స్ చేసి నాకు నచ్చిన బ్రాండ్స్ సినిమాలో పెట్టాలని ఎప్పుడూ చెప్పలేదు.' అన్నారు.

ఏం మాట్లాడుతున్నారు మీరు?

ఏం మాట్లాడుతున్నారు మీరు?

వాలంటైన్స్ డే రాబోతోంది... మీకు ఇప్పటి వరకు ఎంతో మంది ప్రపోజ్ చేసి ఉంటారు. మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏమిటి? మీ వైఫ్ దగ్గర నుంచి కాకుండా... అనే ప్రశ్నకు మహేష్ బాబు రియాక్ట్ అవుతూ.. ‘ఏం మాట్లాడుతున్నారు మీరు?(నవ్వుతూ)... నా భార్య దగ్గర నుంచి తప్ప ఎవరి వద్ద నుంచి అలాంటివి రాలేదు.' అన్నారు.

అందుకే మాకు ఫిబ్రవరి 14 స్పెషల్

అందుకే మాకు ఫిబ్రవరి 14 స్పెషల్

ఫిబ్రవరి 14 నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఫిబ్రవరి 10 మా పెళ్లి రోజు. అందుకే ప్రతి ప్రేమికుల రోజును స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటామని మహేష్ బాబు ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఆ క్షణాలు చాలా స్పెషల్

ఆ క్షణాలు చాలా స్పెషల్

వాలంటైన్ సెలబ్రేషన్స్‌లో మీరు నమ్రతకు ఇచ్చిన, నమ్రత మీకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘గిఫ్టులు ఏమీ గుర్తులేవు. ప్రతి సంవత్సరం మెమొరబుల్. పెళ్లై 14 సంవత్సరాలైపోయింది. దాదాపు అన్నీ హార్ట్ టచింగ్ మూమెంట్సే. నా కొడుకు, కూతురు పుట్టిన క్షణాలు చాలా స్పెషల్' అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X