సూపర్ స్టార్ కోసం రంగంలోకి ప్రముఖ షో జడ్జ్.. ఇక మహేశ్ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే.!
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరు. సూపర్ కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ప్రయోగాలను చేశాడు. వీటిలో కొన్ని నిరాశను మిగిల్చినప్పటికీ వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. తన ఫ్యాన్స్‌ను తల ఎత్తుకుని తిరిగేలా చేయడానికి ఆయన ఎంతగానో శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలోనే మంచి మంచి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం మహేశ్ సరికొత్తగా ట్రై చేస్తున్నాడట. ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేస్తున్నాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నాడు
‘భరత్ అను నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మహేశ్ చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్ అవుతుంది.

మరోసారి ట్రెండ్ సెట్ చేశాడు
కొద్ది రోజుల క్రితం ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ విడుదలైంది. ఇది టాలీవుడ్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డులకెక్కింది. దీనితో పాటు ఈ సినిమాలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట 24 గంటల్లో 9.2 మిలియన్ల వ్యూస్ సాధించి ఔరా అనిపించింది.

పోటీని తట్టుకునేందుకు ప్లాన్
ఒకవైపు సంక్రాంతి రేసులో ఉన్న ‘అల.. వైకుంఠపురములో' నుంచి అదిరిపోయే సాంగ్స్ రిలీజ్ అవుతుండడంతో, ‘సరిలేరు నీకెవ్వరు' మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. దీనిని అధిగమించేందుకు అతడు అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై విడుదలయ్యే సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయని తెలుస్తోంది.

సూపర్ స్టార్ కోసం రంగంలోకి దిగాడు
సాంగ్స్ ఎంత బాగుంటాయో.. తన డ్యాన్స్ కూడా అంతే స్థాయిలో ఉండాలని మహేశ్ బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. కొంచెం కష్టమైన స్టెప్పులు ఉన్నా పర్లేదు అని చెప్పడంతో మాస్టర్ కొన్ని ఫ్లోర్ మూమెంట్స్ కూడా చేయించారని సమాచారం.

ఆ సినిమాలో కష్టపడ్డాడు
తన తోటి హీరోలు డ్యాన్సులు ఇరగదీస్తున్నప్పటికీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం రిస్క్ చేయలేదు. అయితే, ‘1 నేనొక్కడినే' సినిమాలో మాత్రం మంచి మంచి స్టెప్పులు వేశాడు. మళ్లీ చాలా రోజుల తర్వాత సరిలేరు కోసం చెమటోడ్చుతున్నాడట. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ ఖాయంలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











