twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పై టెన్షన్.. మహేష్ స్వీట్ ఆన్సర్

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ గా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు కూడా నిర్మాతలు చెబుతున్నారు. అయితే చాలా ఏరియాల్లో సినిమా ఇంకా పెట్టిన పెట్టుబడిని పూర్తిస్థాయిలో అయితే వెనక్కి తేలేకపోయింది. F3 సినిమాతో పాటు ఇటీవల వచ్చిన మేజర్ సినిమా మంచి రెస్పాన్స్ రావడంతో సర్కారు వారి పాట కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి.

    అయితే వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఇప్పుడు పెద్ద హీరోలకు ఆనవాయితీగా మారిపోయింది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈజీగా వందకోట్ల మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదో అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఇక 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఎప్పుడూ టెన్షన్ పడలేదా? అని మహేష్ బాబుకు ఒక ప్రశ్న ఎదురయింది.

    mahesh babu sweet answer on 100 cr pre release business

    రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఒక విధంగా వందకోట్ల మార్కెట్ అనే దానిపై నేను టెన్షన్ పడలేదు. అయితే మన మార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రం నేను ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఒక విధంగా అది సంతోషించాల్సిన విషయమే. నేను నెక్స్ట్ సినిమా తో ఎంతవరకు పైకి వచ్చాను అనే విషయాన్ని ఎక్కువగా చూస్తాను. వందకోట్ల టెన్షన్ అనేది పెద్దగా పట్టించుకోను.. అని మహేష్ వివరణ ఇచ్చాడు.

    ఇక కథల విషయంలో కూడా తాను ఇప్పుడు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పిన మహేష్ బాబు ఎవరితోనూ పెద్దగా చర్చలు జరపనని కూడా చెప్పాడు. ఇక మేజర్ సినిమా కథ విషయంలో కూడా అడవి శేష్ వచ్చి కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను ఒక నిర్మాతగా అలాగే ఒక హీరోగా కథల విషయంలో అయితే నేను ఎప్పటికీ సొంతంగానే నిర్ణయం తీసుకుంటాను అని వివరణ ఇచ్చాడు.

    English summary
    mahesh babu sweet answer on 100 cr pre release business..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X