Sarkaru Vaari Paata: మహేశ్ బాబు రీఎంట్రీకి ప్లాన్ రెడీ.. టార్గెట్ ఫినీష్ చేసేందుకే కఠిన నిర్ణయం
ఆ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అయినా.. కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో మహేశ్ బాబు చేస్తున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని సెటైరికల్‌గా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి అనుకోని కష్టాలు వచ్చాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొంత కాలంగా మోకాలికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నాడు. 'స్పెడర్' మూవీ షూటింగ్ సమయంలో అతడి కాలికి గాయం అయింది. దీంతో ఆ తర్వాత అమెరికాలో సర్జరీ చేయించుకోవాలని అనుకున్నాడు. కానీ, అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూనే వచ్చింది. దీంతో మహేశ్ అలాగే ఇప్పటి వరకూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'సర్కారు వారి పాట' షూట్‌లో పాల్గొన్న సమయంలో అతడిని మరోసారి ఆ సమస్య ఇబ్బంది పెట్టింది. దీంతో తాజాగా సూపర్ స్టార్ దుబాయ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు.
మహేశ్ బాబు సర్జరీ కారణంగా 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్‌కు దూరం అయ్యాడు. అంతేకాదు, అతడు దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులపైనా దాని ప్రభావం పడబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మహేశ్ బాబు ఫిబ్రవరి నుంచి 'సర్కారు వారి పాట' షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడట. దీన్ని ఏప్రిల్ ఒకటిన విడుదల చేయనున్న నేపథ్యంలోనే అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. షూట్‌ను త్వరగా పూర్తి చేసిన తర్వాత మరోసారి విశ్రాంతి తీసుకుంటాడని తెలిసింది.

'సర్కారు వారి పాట' సినిమాలో మహేశ్ బాబు క్లాస్, మాస్‌గా రెండు రోల్స్ చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











