లండన్ కు మహేష్ బాబు.. కుమారుడి కోసమే అలా.. ఎందుకంటే?
సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇప్పటికి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పటికే వెకేషన్ లో మునిగితేలుతున్న మహేష్ బాబు మరోసారి లండన్ వెళ్ళబోతున్నట్లు సమాచారం. అయితే అది కూడా పర్సనల్ ట్రిప్ అని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

నష్టాలు కూడా
చివరిగా మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ తో రికార్డులు బద్దలు కొట్టిందని ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కొంత మంది నష్టాలు కూడా వచ్చాయని అంటున్నారు.

ఆగస్టు నెలలో
ఆ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రూపొందనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని హారిక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుందని వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రకటన వచ్చింది.

వన్ నేనొక్కడినే
ఇక సినిమా షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడానికి ఆసక్తి చూపించే మహేష్ బాబు ఇప్పటికే రకరకాల దేశాలు చుట్టి వచ్చారు. ఇప్పుడు మరోసారి లండన్ ట్రిప్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ట్రిప్ కాదని తన కుమారుడు గౌతమ్ కృష్ణను లండన్లోని ఒక ప్రముఖ కాలేజీలో జాయిన్ చేసేందుకే మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి ప్రత్యేక ఫ్లైట్ లో అక్కడికి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గౌతమ్ కృష్ణ కూడా ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

లండన్
అయితే గౌతమ్ కి నటన మీద ఆసక్తి లేదని చదువు మీద ఆసక్తి ఉందని గతంలోనే మహేష్ బాబు, నమ్రతలు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే సితార పాప మాత్రం నటన మీద ఇతర సాంస్కృతిక అంశాల మీద ఆచూకీ చూపిస్తూ ఉంటుందని చెప్పుకొచ్చారు.. ఇక గౌతమ్ కృష్ణ కాలేజీ చదువు నిమిత్తమే లండన్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది.

షూటింగ్ లో
మూడేళ్ల ఈ కోర్సు ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఏ కాలేజ్ అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ గౌతమ్ జాయిన్ అయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











