Mahesh Babu: హాలీవుడ్ మూవీతో మహేష్‌బాబు.. సింహంలా గర్జించనున్న సూపర్‌స్టార్!

ప్రపంచ సినిమా రంగంలో లయన్ కింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈ సినిమా ఫ్రాంచైజీ త్వరలోనే సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ది లయన్ కింగ్ ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ కానున్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు భాగం కానున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి బ్యారీ జెన్‌కిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఫాసా పాత్రకు ఇంగ్లీష్‌లో ఆరోన్ పియరే గొంతును ఇవ్వగా, యంగ్ ముఫాసాకాు బ్రేలీన్ రాంకిన్స్, టాకాకు కెల్విన్ హారిస్, యంగ్ టాకాకు తియే సోమోల్ డబ్బింగ్ చెప్పారు.

ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు భారతీయ నటులందరూ తమ తమ భాషల్లో భాగమవుతున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్‌కు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఆయన తనయలు ఆర్యన్ ఖాన్, అబ్‌రామ్ ఖాన్ లాంటి వాళ్లు భాగమయ్యారు. హిందీ వెర్షన్‌లో ముసాఫాకు షారుక్, సింబా రోల్‌కు ఆర్యన్ ఖాన్, కుర్ర ముసాఫాకు అబ్‌రామ్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.

Mahesh Babu to lend his Voice to Mufasa for Disney s Mufasa The Lion King

ఇక తెలుగు వెర్షన్ కోసం డిస్నీ సంస్థ సూపర్ స్టార్‌ను సంప్రదించింది. తనకు కూడా అమితమైన ఇష్టం ఉండటంతోపాటు ది లయన్ కింగ్ అంటూ క్రేజ్ ఉండటంతో ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ముసాఫా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ వార్తతో సూపర్ స్టార్ అభిమానులందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ముఫాసాకు డబ్బింగ్ చెప్పిన విషయంలో మహేష్ బాబు స్పందిస్తూ.. డీస్నీ అందించే వినోదం, కథలు చెప్పే విధానం, లెగసీ క్యారెక్టరను అందించే తీరుకు నేను ముగ్దుడిని అవుతాను. ముఫాసా క్యారెక్టర్ ఓ మంచి తండ్రి. తన అటవీ సామ్రాజ్యంలో తన పిల్లలకు మార్గదర్శిగా నిలిచే తీరు నన్ను ఆకట్టుకొంటునంది. నాకు కూడా కుటుంబం అంటే సర్వస్వం. ఈ సినిమాకు డిస్నీతో అనుబంధం ఏర్పడటం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం నా పిల్లలకు సంతోషంగా ఉంది. 20వ డిసెంబర్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నేను డబ్బింగ్ చెప్పిన ముసాఫా అందర్నీ మెప్పిస్తుందని అనుకొంటున్నాను అని అన్నారు.

ఇక ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా ఆగస్టు 26వ తేదీన తెలుగు ట్రైలర్ లాంచ్ జరుగనున్నది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానున్నది. ఇండియాలో ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది.

Mahesh Babu to lend his Voice to Mufasa for Disney s Mufasa The Lion King

ఇదిలా ఉండగా, గుంటూరుకారం మూవీ తర్వాత మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మూవీ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో గానీ, అక్టోబర్ తొలివారంలో గానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X