మహేష్ బాబు ఖాతాలో మరో బ్రాండ్.. ఇంటర్నేషనల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా?
మహేష్ బాబు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క అనేక రకమైన యాడ్స్ లో కూడా భాగం అవుతుంటారు. అలాగే ఆయన అనేక బ్రాండ్ లకు కూడా అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అనేక కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు ఖాతాలో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక బ్రాండ్ వచ్చి చేరింది. ఆ వివరాల్లోకి వెళితే..

బ్రాండ్ అంబాసిడర్ గా
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలతో మరో పక్క బ్రాండ్ ఎండార్స్ మెంట్ల తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన థమ్సప్, అభి బస్, ఐడియా, సంతూర్, పారగాన్, మౌంటెన్ డ్యూ, బిగ్ సి లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు ఒక ప్రముఖ అంతర్జాతీయ కార్ల బ్రాండ్ కొత్త వెంచర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు అయ్యారు.
ఆడి కార్ కి
బాగా డబ్బున్న వాళ్లు మాత్రమే వాడే ఆడి కార్ లోని ఎలక్ట్రికల్ వేరియంట్ కి ఇప్పుడు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం మీద మహేష్ బాబు పేరుతో ఆడి మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా దీనికి సంబంధించిన యాడ్ కూడా ఒకటి చిత్రీకరించారని తెలుస్తోంది యాడ్ అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకుగాను భారీ పారితోషికం కూడా ఆయన తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఈ ట్రోన్
ఇప్పటివరకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన బ్రాండ్స్ అన్నిటికంటే దీని పారితోషికం బాగా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అంతేకాక ఆయన కొత్తగా ఆడి సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఈ ట్రోన్‌ను కొనుగోలు చేశారు. గతేడాది ఈ ట్రోన్ కారుని ఆడి సంస్థ లాంఛ్ చేయగా అప్పుడే మహేశ్ బాబు ఈ కారుని బుక్ చేసుకున్నారు. కాగా 2022 ఏప్రిల్ 16న మహేశ్‌బాబుకి కారుని హ్యాండోవర్ చేసింది.

కారు వాడుతూ
ఆడి ఈ ట్రోన్ కారు ఎక్స్‌షోరూం ధర రూ 1.01 కోట్ల నుంచి 1.19 కోట్ల వరకు ఉండగా ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71 కిలోవాట్స్, 308 హార్స్ పవర్స్‌తో 540 ఎన్‌ఎం టార్క్‌ని అందిస్తుంది. కేవలం 6.8 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడు అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు కాగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చట. ఇక తాను కారు వాడుతూ దీనిని ప్రమోట్ చేయనున్నారని అంటున్నారు.

సినిమాల విషయానికి వస్తే
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ఈ సినిమా మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications











