రెస్టారెంట్ బిజినెస్ లోకి మహేష్ బాబు.. ఆ బడా గ్రూప్ తో కలిసి రంగంలోకి!
టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు అనేక రకాల బిజినెస్లలో తమ పెట్టుబడులు కూడా పెట్టారు. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూడా ఒక కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

రెస్టారెంట్ బిజినెస్ లో
ఇప్పటికే తెలుగు హీరోలు చాలామంది రెస్టారెంట్ బిజినెస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు చాలామంది హీరోలు రెస్టారెంట్లు ప్రారంభించగా అవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో గ్రాండ్ గా రన్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సందీప్ కిషన్, అల్లు అర్జున్, శర్వానంద్, నవదీప్ వంటి వారు ప్రారంభించిన రెస్టారెంట్లకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు అదే బాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నడవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

రెస్టారెంట్ చైన్
సూపర్ స్టార్ మహేష్ బాబు మినర్వా గ్రూప్ ఆఫ్ హోటల్స్ తో కలిసి రెస్టారెంట్ చైన్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు క్రేజ్ పెట్టుబడిగా వ్యాపారంలోకి దిగపోతున్నారని తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు ఇప్పటికే సినిమా హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరించారు. తన సినిమాలకు మాత్రమే కాకుండా మేజర్ లాంటి సినిమాలు కూడా ఆయన పెట్టుబడులు పెట్టి మంచి బిజినెస్ అందుకోవడమే గాక మంచి సినిమాలు చేసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

చివరిగా
ఇక అందులో భాగంగానే ఆయన హైదరాబాద్ లో ఏఎంబీ మాల్ లో భారీగా పెట్టుబడులు పెట్టి దాన్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకే ఆయన మినర్వా గ్రూప్ ఆఫ్ హోటల్స్ తో కలిసి వ్యాపారం చేయబోతున్నారని అంటున్నారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే చివరిగా ఆయన సర్కారు వారి పాట అనే సినిమా చేశాడు. దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

ఆగస్టు నెలలో
ఈ సినిమా అనుకున్నంత మేర ఆడలేదని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇక మరో పక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభిస్తామని ఇప్పటికే సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మరికొద్ది రోజులలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

కన్ఫ్యూజన్
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా ఇప్పటికీ సిద్ధం కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు చేసే సినిమా కథ సిద్ధమైందని చెబుతుంటే మహేష్ బాబు మాత్రం అదేమీ లేదని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉందని పలు సందర్భాలలో వెల్లడించారు. కాబట్టి ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











